Horoscope | శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి ఉద్యోగులకు పదోన్నతులు..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)
మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారులకు కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి. సంతానం పురోగతి ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. ప్రభుత్వ, వైద్య రంగాల్లో పనిచేసే వారికి ఈ రోజు చాలా అదృష్టదాయకంగా ఉంటుంది.
వృషభం (Taurus)
వృషభరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. కాలం అన్ని విధాలా సహకరిస్తోంది. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. మీ కృషి, సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా అత్యంత ఫలదాయకమైన రోజు. ఉద్యోగ వ్యాపారాలలో చక్కని పురోగతి ఉంటుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
మిథునం (Gemini)
మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నట్లుగా భావిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో సంకట పరిస్థితులు ఎదురవుతాయి. సమయానుకూల నిర్ణయాలతో మేలు జరుగుతుంది. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించండి. ఖర్చులు అదుపు చేయండి.
కర్కాటకం (Cancer)
కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. చంచల బుద్ధితో తీసుకునే నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. మానసికంగా దృఢంగా ఉండడానికి ప్రయత్నించండి. డబ్బు ఎవరికీ అప్పుగా ఇవ్వొద్దు, తీసుకోవద్దు. వృథా ఖర్చులు నివారించండి.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. రెట్టింపు వేగంతో, ఉత్సాహంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. బుద్ధిబలంతో ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఆత్మవిశ్వాసంతో, దృఢ నిశ్చయంతో క్లిష్టమైన పనులను కూడా పూర్తి చేస్తారు. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో, అధికారిక పనుల్లో ఆర్థిక లాభం పొందుతారు.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. సమయస్ఫూర్తితో వివాదాలకు ముగింపు పలుకుతారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.
తుల (Libra)
తులారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో సాధించిన విజయాలు, ఆర్థిక ప్రయోజనాలు సంతృప్తి కలిగిస్తాయి. స్నేహితుల ద్వారా అదనపు ఆదాయ వనరులు అందుకుంటారు. ప్రయాణాలు ఆహ్లాదకరంగా సాగుతాయి. పనిపట్ల శ్రద్ధ తగ్గకుండా చూసుకోండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా, అదృష్టకరంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఊహించని విజయాలు సాధిస్తారు. మీ ప్రతిభను ఉన్నతాధికారులు గుర్తిస్తారు. పదోన్నతికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక లాభాలు అందుకుంటారు. సమాజంలో గౌరవం, పరపతి పెరుగుతాయి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో సమస్యలుండవచ్చు. అయితే ఈ సమస్యలు తాత్కాలికమే! సహచరులు, పోటీదారులతో సందర్భానుసారం నడుచుకుంటే సమస్యలు తొలగుతాయి. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించి చర్చలు జరుగుతాయి. కుటుంబ సౌఖ్యం కలదు. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఇంటా బయటా వ్యతిరేక పరిస్థితులు ఉంటాయి. చట్టపరమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి పరంగా ఎదురయ్యే ఏ అవకాశాన్ని వదులుకోకండి. ఆర్థికపరంగా నష్టాలు సంభవించే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. ఆలోచించి ఖర్చు చేయాలి.
కుంభం (Aquarius)
కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు ఆందోళన కలిగిస్తాయి. కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సహకారం మేలు చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మనోధైర్యాన్ని కోల్పోవద్దు. ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతారు.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత స్థానంలో నిలవాలనుకుంటే సృజనాత్మకంగా వ్యవహరించండి. పట్టుదలతోనే చేపట్టిన పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కీలక వ్యవహారాల్లో జాప్యం చోటు చేసుకోవచ్చు. అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి.