Anemia | రక్తహీనతతో బాధపడుతున్నారా..? అయితే పాలకూర తినాల్సిందే..!

Anemia | ఆకుకూర‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగ‌తి తెలిసిందే. వీటిలో సూక్ష్మ పోష‌కాలు అధికంగా ఉంటాయి. మ‌నం ఆహారంగా తీసుకునే వివిధ ఆకుకూర‌ల్లో పాల‌కూర (Spinach) కూడా ఒక‌టి. దీనిలో కూడా పోష‌కాలు మెండుగా ఉంటాయి.

  • By: raj |    health-news |    Published on : Jan 17, 2026 11:00 PM IST
Anemia | రక్తహీనతతో బాధపడుతున్నారా..? అయితే పాలకూర తినాల్సిందే..!

Anemia | ఆకుకూర‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగ‌తి తెలిసిందే. వీటిలో సూక్ష్మ పోష‌కాలు అధికంగా ఉంటాయి. మ‌నం ఆహారంగా తీసుకునే వివిధ ఆకుకూర‌ల్లో పాల‌కూర (Spinach) కూడా ఒక‌టి. దీనిలో కూడా పోష‌కాలు మెండుగా ఉంటాయి. పాల‌కూర‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బీటాకెరోటీన్, లుటీన్, జియాక్సంతిన్, క్లోరోఫిల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీక‌ర‌ణ ఒత్తిడిని తగ్గించి ఫ్రీ రాడిక‌ల్స్ నుండి శ‌రీరాన్ని కాపాడ‌డంలో స‌హాయ‌ప‌డతాయి. దీంతో దీర్ఘకాలిక అనారోగ్య స‌మ‌స్యల బారిన ప‌డే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. పాలకూర వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. పాల‌కూర‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల పోష‌కాహార లోపం చాలా వ‌ర‌కు త‌గ్గుతుంది. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడే వారికి ఇది బెస్ట్‌ ఫుడ్‌ అని చెప్పాలి. అనీమియా (Anemia)ని తగ్గించడంలో పాలకూర ప్రధాన పాత్ర పోషిస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఫేస్‌ చేసే సమస్యల్లో అనీమియా ఒకటి. ఇది హిమోగ్లోబిన్ లెవల్స్‌ తగ్గినప్పుడు ఏర్పడుతుంది. దీని వల్ల శరీరానికి తగినంత ఆక్సిజన్‌ అందదు. అలసట, బలహీనత, తలనొప్పి, ఊపిరితిత్తుల సమస్యలు వంటి అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. ఈ సమస్యకు చక్కటి పరిష్కారం పాలకూర తినడమే అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. పాలకూర రక్తహీనతని తగ్గించే బెస్ట్ రెమిడీ. ఇందులో ఇనుము అధికంగా ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గించడంలో సాయపడుతుంది. అంతేకాదు విటమిన్‌ సి, బి12, ఫోలిక్‌ యాసిడ్‌ వంటివి ఉంటాయి. పాలకూర తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్‌ లెవల్స్‌ పెరుగుతాయి. అందుకే వారంలో కనీసం రెండుసార్లైన పాలకూర తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

విట‌మిన్ సి ముఖ్యం..

మ‌న శ‌రీరానికి ఐర‌న్ కావాలంటే దాన్ని పాల‌కూర తింటే నేరుగా పొంద‌లేము. విట‌మిన్ సి ఉండే ఆహారాల‌తోపాటూ పాలకూరను తినాల్సి ఉంటుంది. దీంతో విట‌మిన్ సి స‌హాయంతో మ‌న శ‌రీరం పాల‌కూర‌లో ఉండే ఐర‌న్‌ను శోషించుకుంటుంది. ముఖ్యంగా మ‌న‌కు నిమ్మకాయ‌లు, కివి, స్ట్రాబెర్రీలు, క్యాప్సికం వంటి వాటిల్లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. క‌నుక వీటిని పాల‌కూర‌తోపాటు తినాల్సి ఉంటుంది. దీంతో శ‌రీరానికి ఐర‌న్ స‌మృద్ధిగా ల‌భిస్తుంది. దీని వ‌ల్ల ర‌క్తం అధికంగా త‌యార‌వుతుంది. ర‌క్తహీన‌త స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

గుండెకూ మంచిదే..

పాల‌కూర‌ను ప‌చ్చిగా కంటే ఉడ‌క‌బెట్టి తింటేనే ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే పాల‌కూర‌ను ఉడ‌కబెడితే అందులో ఉండే పోష‌కాల శాతం పెరుగుతుందట. పాల‌కూర‌ను ఉడ‌క‌బెట్టడం వ‌ల్ల అందులో ఉండే ఐర‌న్ శాతం ఎక్కువ‌వుతుంది. అలాగే పాల‌కూర‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగానే ఉంటాయి. ముఖ్యంగా ప‌చ్చి పాల‌కూర‌లో లుటీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. అయితే పాల‌కూర‌ను ఉడ‌క‌బెడితే ఆగ్జలేట్స్ సుల‌భంగా విడిపోతాయి. దీని వ‌ల్ల అంత సుల‌భంగా కిడ్నీ స్టోన్లు ఏర్పడ‌వు. అలాగే శ‌రీరం ఐర‌న్‌ను కూడా అధికంగా శోషించుకుంటుంది.

జీర్ణక్రియ మెరుగుపరచడం

పాలకూరలో పీచు (fiber) అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడితే, శరీరానికి అవసరమైన పోషకాలు సులభంగా శోషణ అవుతాయి. రక్తహీనతతో బాధపడే వారికి జీర్ణక్రియ సక్రమంగా ఉండటం చాలా ముఖ్యమైన విషయం, ఎందుకంటే శరీరానికి ఐరన్ మరియు ఇతర పోషకాలు అందడం అవసరం. పాలకూరలో పీచు సమృద్ధిగా ఉండటం వలన, ఇది రక్తహీనతను తగ్గించడంలో ఒక సహజ పరిష్కారంగా ఉంటుంది. ఈ ఆకుకూరను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రక్తహీనత సమస్యలు తగ్గి, శరీరానికి తగినంత ఆక్సిజన్ సరఫరా మెరుగు పరుస్తుంది. ఆరోగ్యకరమైన జీవన శైలిని అందిస్తుంది.