Horoscope | శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి అవివాహితులకు కళ్యాణ యోగం..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. వృత్తి పరంగా, ఆర్థికంగా మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. మొహమాటంతో ఇబ్బందులు పడతారు.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం మంచిది. కొత్త ప్రాజెక్టులు, అస్సైన్మెంట్లు వాయిదా వేయడం మంచిది. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాలు అనుభవజ్ఞుల సలహాలు అవసరపడతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. స్నేహితులతో కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా చాలా అదృష్టమైన రోజు. స్నేహితుల నుంచి సహోద్యోగులు నుంచి సంపూర్ణ సహకారాలు అందుతాయి. మీ ప్రతిభకు, సమర్ధతకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. దైవబలంతో అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో శుభవార్తలు వింటారు. ఆర్థికంగా మేలైన సమయం. పలు మార్గాల నుంచి డబ్బు రాక పెరుగుతుంది. సన్నహితుల నుంచి కానుకలు అందుకుంటారు. ప్రియమైనవారిని కలుసుకుని సంతోషంగా గడుపుతారు.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. గ్రహసంచారం అనుకూలంగా లేనందున ప్రతి పనిలోను జాగ్రత్తగా నడుచుకోవాలి. ఉద్యోగంలో ఆచి తూచి నడుచుకోవాలి. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. కుటుంబ వాతావరణం ఉద్రిక్తతలతో నిండి ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు మానసిక ఒత్తిడికి గురిచేస్తాయి.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. సోదరులతో, రక్త సంబంధీకులతో అనుబంధం దృఢ పడుతుంది. ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి, కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు మీ జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగంలో నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఉన్నతాధికారులు మీకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో ధనలాభాలు పెరగడంతో ఆర్థికంగా బలోపేతం అవుతారు.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. దైవబలం, గురుబలం అనుకూలతతో పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రారంభించిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. ఆర్థికంగా విశేషమైన లాభాలు అందుకుంటారు. కుటుంబంలో మంగళకరమైన శుభకార్యాలు జరుగుతాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గ్రహాల అనుకూలత తక్కువగా ఉన్నందున చేపట్టిన పనుల్లో ప్రయత్న బలం పెంచాలి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆచి తూచి అడుగేయాలి. వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండాలి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం తగదు. వ్యాపారంలో ఆర్థిక నష్టం ఉండవచ్చు. ఆదాయాన్ని మించిన వ్యయం ఆందోళన కలిగిస్తుంది.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి అనువైన రోజు. వృత్తిపరంగా చేసే ప్రయాణాలు కలిసి వస్తాయి. సన్నిహితుల నుంచి ఆర్థికంగా లబ్ది పొందుతారు. సామాజికంగా కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. వృత్తి పరంగా ఒక అనుకూల సంకేతం ఆనందం కలిగిస్తుంది. అవివాహితులకు కళ్యాణ యోగం ఉంటుంది.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగా వ్యాపారాల్లో ఉత్సాహంగా ముందుకు సాగితే ఆశించిన ఫలితాలు పొందవచ్చు. భావోద్వేగాలు అదుపులో ఉంచుకోడానికి ప్రయత్నించండి. సానుకూల దృక్పథంతో చేసే పనులలో విజయం చేకూరుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. డబ్బు మంచినీళ్లలా ఖర్చవుతుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram