Horoscope | శుక్రవారం రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అనవసర ధన వ్యయం..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ స్వధర్మం మిమ్మల్ని ఉన్నతులుగా చేస్తుంది. కీలకమైన పనులు ప్రారంభించడానికి అనువైన సమయం. ఉద్యోగ వ్యాపారాల్లో కీర్తి ప్రతిష్ఠలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక శుభవార్త ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు ఉంటాయి. దైవబలంతో కీలకమైన పనుల్లో పురోగతి ఉంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు బుద్ధిబలంతో అధిగమిస్తారు. ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. అధికారులతో జాగ్రత్తగా నడుచుకోవాలి. వివాదాస్పద అంశాలకు దూరంగా ఉంటే మంచిది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో శ్రద్ధ, ఏకాగ్రత అవసరం. ఉద్యోగంలో స్థానచలనం ఉండవచ్చు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. అనవసర ధనవ్యయం సూచితం. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రారంభించిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. స్పష్టమైన నిర్ణయాలతో ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. అవసరానికి డబ్బు అందుతుంది. ముఖ్యమైన పనుల్లో అప్రమత్తంగా ఉండాలి. సమయానుకూల నిర్ణయాలతో మేలు జరుగుతుంది. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శ్రేష్టమైన సమయం నడుస్తోంది. ఉద్యోగ వ్యాపారాల్లో విజయ పరంపరలు కొనసాగుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. కీలక వ్యవహారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఉద్యోగంలో ఆశించిన ఫలితాల కోసం శ్రమ తప్పదు. అధికారులతో జాగ్రత్తగా నడుచుకోవాలి. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. బంధు మిత్రులతో కలహాలకు దూరంగా ఉండాలి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శుభసమయం నడుస్తోంది. ముందుచూపుతో వ్యవహరించి ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. దైవబలంతో ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. వృత్తిరీత్యా చేసే ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. గ్రహసంచారం అనుకూలంగా ఉన్నందున ఏ పని ప్రారంభించినా సకాలంలో పూర్తవుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికార యోగం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ధనధాన్య లాభాలున్నాయి. వృథా ఖర్చులు నివారిస్తే మంచిది.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పట్టుదలతో, స్వయంకృషితో ఉద్యోగంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తారు. అధికారులు ప్రశంసలు అందుకుంటారు. భూ, గృహ యోగాలున్నాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చంచల బుద్ధితో తీసుకునే నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆచి తూచి అడుగేయాలి. కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. వ్యాపారంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. బంధు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉంటే మంచిది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram