Venu Swamy | వేణు స్వామిపై కేసు పెడతాం: ఫిల్మ్ జర్నలిస్టులు
హీరో నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల ఎక్కువకాలం కలిసి ఉండరంటూ జ్యోతిష్కుడు వేణు స్వామి చెప్పిన జోస్యంపై వివాదం కొనసాగుతుంది
విధాత, హైదరాబాద్ : హీరో నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల ఎక్కువకాలం కలిసి ఉండరంటూ జ్యోతిష్కుడు వేణు స్వామి చెప్పిన జోస్యంపై వివాదం కొనసాగుతుంది. ఈ విషయంలో ఆయనపై కేసు నమోదు చేయాలని తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(టీఎఫ్‌జేఏ), తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్(టీఎఫ్‌డీఎంఏ) నిర్ణయించాయి. సోషల్ మీడియాలో సెలబ్రిటీలను కించపరుస్తూ ఆన్ లైన్‌లో కామెంట్స్ చేసేవారికి తమ చర్యలు అడ్డుకట్ట వేస్తాయని సంస్థల ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. సమంతతో విడాకుల పిదప నాగ చైతన్య తాజాగా శోభితా దూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్నారు.
View this post on Instagram
ఈ జంట త్వరలో పెళ్లి పీటలెక్కనున్న నేపథ్యంలో వేణు స్వామి సంచలన జోస్యం చెప్పారు. నాగచైతన్య రెండో పెళ్లి కూడా విఫలమవుతుందని, వారిద్ధరు ఎక్కువ కాలం కలిసి ఉండరంటూ జోస్యం చెప్పారు. వివాదస్పద జోస్యాలకు మారుపేరైన వేణుస్వామి నాగచైతన్య రెండో పెళ్లిపై చెప్పిన జోస్యం వివాదస్పమై విమర్శల పాలైంది. ఈ నేఫథ్యంలో ఫిల్మ్ జర్నలిస్టులు కేసు నమోదుకు నిర్ణయించడం చర్చనీయాంశమైంది.
View this post on Instagram
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram