జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి సొంత పార్టీ షాక్.!
జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్న దుష్యంత్ రెడ్డిని పార్టీని తనను కించపరుస్తూ మాట్లాడటం భూ వివాదాల్లో తలదూర్చారనే ఆరోపణలతో రాజాపూర్ మండల కాంగ్రెస్ ఐదేళ్ల పాటు సస్పెండ్ చేసింది. అనిరుధ్ రెడ్డి సీఎం రేవంత్ పై తరచూ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ సస్పెన్షన్ చర్చనీయాంశమైంది.
విధాత : జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి సొంత పార్టీ నుంచి గట్టి షాక్ ఎదురైంది. అనిరుధ్ రెడ్డి అన్న దుష్యంత్ రెడ్డిని ఐదేళ్లపాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ రాజాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కృష్ణయ్య యాదవ్ ఓ ప్రకటన విడుదల చేయడం కలకలం రేపింది. ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో దుష్యంత్ రెడ్డి పార్టీని, తనను కించపరుస్తూ విమర్శలు చేసినట్లుగా కృష్ణయ్య యాదవ్ పేర్కొన్నారు. అలాగే పలు భూ వివాదాల్లో తలదూర్చినట్టు కృష్ణయ్య యాదవ్ ఆరోపించారు.
దుష్యంత్ రెడ్డిపై రాజాపూర్ పోలీస్ స్టేషన్ లో, కాంగ్రెస్ పెద్దలకు కృష్ణయ్య యాదవ్ ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తరచూ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దుష్యంత్ రెడ్డి సస్పెండ్ వ్యవహారం చర్చనీయాంశమైంది.

X
Google News
Facebook
Instagram
Youtube
Telegram