Casting Couch| కొందరు హీరోయిన్స్ ఇష్టంతో కాస్టింగ్ కౌచ్‌కి ఒప్పుకుంటారు.. ఫిదా న‌టి షాకింగ్ కామెంట్స్

Casting Couch| ఇటీవ‌లి కాలంలో కాస్టింగ్ కౌచ్ అనే పదం ఇండ‌స్ట్రీలో ఎక్కువ‌గా వినిపిస్తుంది. చాలా మంది భామ‌లు తాము కాస్టింగ్ కౌచ్ వ‌ల‌న ఎంత ఇబ్బందిప‌డింది నిర్భ‌యంగా మీడియా ముందుకు చెప్పేస్తున్నారు. చాలా సంద‌ర్భాల‌లో నటీమణులు ధైర్యంగా తమకి ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాలని

  • By: sn    cinema    May 30, 2024 7:30 AM IST
Casting Couch| కొందరు హీరోయిన్స్ ఇష్టంతో కాస్టింగ్ కౌచ్‌కి ఒప్పుకుంటారు.. ఫిదా న‌టి షాకింగ్ కామెంట్స్

Casting Couch| ఇటీవ‌లి కాలంలో కాస్టింగ్ కౌచ్ అనే పదం ఇండ‌స్ట్రీలో ఎక్కువ‌గా వినిపిస్తుంది. చాలా మంది భామ‌లు తాము కాస్టింగ్ కౌచ్ వ‌ల‌న ఎంత ఇబ్బందిప‌డింది నిర్భ‌యంగా మీడియా ముందుకు చెప్పేస్తున్నారు. చాలా సంద‌ర్భాల‌లో నటీమణులు ధైర్యంగా తమకి ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాలని బయటపెడుతుండ‌డంతో కొంద‌రి గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయి. అయితే ఫిదా చిత్రంలో హీరోయిన్ ఫ్రెండ్‌గా న‌టించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన గాయ‌త్రి గుప్తా ఒక్కోసారి బోల్డ్ కామెంట్స్ చేస్తూ వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. ఈమె కూడా ప‌లు సంద‌ర్భాల‌లో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడ‌డం మ‌నం చూశాం. అయితే తాజా ఇంట‌ర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది.

గతంలో నేను కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడితే ఎవరూ సపోర్ట్ చేయలేదు. చాలా మంది హీరోయిన్లు ఇష్టంతోనే శృంగారానికి ఒప్పుకుంటున్నారు. ఆ క్ర‌మంలో ఛాన్స్ లు దక్కించుకుంటున్నారు. మరికొంద‌రు న‌టీమ‌ణులు అయితే ఇష్టం లేక‌పోయిన ఆఫర్స్ కోసం ఒప్పుకోక త‌ప్ప‌డం లేదు. అయితే కాస్టింగ్ కౌచ్‌కి ఒప్పుకున్నా అవ‌కాశాలు వ‌స్తాయ‌ని గ్యారెంటీ లేక‌పోవ‌డంతో చాలా మంది అమాయ‌కులు మోస‌పోవ‌డం జరుగుతుంది. కొందరిని వాడుకొని వ‌దిలేస్తున్నారే త‌ప్ప అవ‌కాశాలు ఇవ్వ‌డం లేదు. టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువ‌గా ఉందంటూ గాయ‌త్రి ఆరోపించింది. అంతేకాకుండా కొంద‌రు ప్ర‌ముఖుల‌పై కూడా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.

ప్రస్తుతం గాయత్రీ గుప్తా ఆర్థరైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది. ఇది నయం కావాలంటే ట్రీట్ మెంట్ కి చాలా డబ్బు ఖర్చవుతుంది. కానీ నా దగ్గర అంత డబ్బు లేదని గాయత్రీ గుప్త ఆవేదన వ్యక్తం చేసింది. గాయ‌త్రి బుర్రకథ, కొబ్బరి మట్ట, ఐస్ క్రీం 2 లాంటి చిత్రాల్లో నటించిన కూడా ఫిదా చిత్రంతోనే ఎక్కువ గుర్తింపు సంపాదించుకుంది గాయత్రీ గుప్తా. ఆమె ఇటీవ‌ల కాలంలో ఎక్కువ‌గా వివాదాల‌తోనే హైలైట్ అవుతుంది.