Gayatri gupta | బిగ్ బాస్ ఆడిష‌న్స్ అని చెప్పి అమ్మాయిల‌ని హోట‌ల్‌కి తీసుకెళ‌తారంటూ ఫిదా బ్యూటీ షాకింగ్ కామెంట్స్

Gayatri gupta| ఫిదా బ్యూటీ గాయ‌త్రి గుప్తా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు సినిమాల క‌న్నా కూడా వివాదాల‌తోనే ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. అప్పట్లో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇండస్ట్రీని షేక్ చేసి.. రచ్చ రేపింది. షార్ట్ ఫిల్మ్స్‌తో కెరియర్ స్టార్ట్ చేసి.. ఫిదా, కొబ్బరి మట్ట, ఐస్ క్రీం వంటి చిత్రా

  • By: sn    cinema    Jun 02, 2024 6:32 PM IST
Gayatri gupta | బిగ్ బాస్ ఆడిష‌న్స్ అని చెప్పి అమ్మాయిల‌ని హోట‌ల్‌కి తీసుకెళ‌తారంటూ ఫిదా బ్యూటీ షాకింగ్ కామెంట్స్

Gayatri gupta| ఫిదా బ్యూటీ గాయ‌త్రి గుప్తా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు సినిమాల క‌న్నా కూడా వివాదాల‌తోనే ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. అప్పట్లో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇండస్ట్రీని షేక్ చేసి.. రచ్చ రేపింది. షార్ట్ ఫిల్మ్స్‌తో కెరియర్ స్టార్ట్ చేసి.. ఫిదా, కొబ్బరి మట్ట, ఐస్ క్రీం వంటి చిత్రాల్లో నటించిన గాయత్రి గుప్తా నటిగా గుర్తింపు తెచ్చుకుంది.చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న నటి గాయత్రి గుప్తా తాజాగా ఇంటర్వ్యూలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ షోకి వెళ్లాలంటే అగ్రిమెంట్ ఓ చాలా కండిషన్స్ ఉంటాయి. అయితే వాట‌న్నింటికి నేను ఓకే చెప్పాను.

బిగ్ బాస్‌కి సైన్ చేశాక ఇతర చిత్రాలకు ఒప్పుకోకూడదు అని అన్నారు. ఆ స‌మ‌యంలో నేను 15 చిత్రాలు వదులుకున్నాను. కానీ నన్ను సడెన్ గా బిగ్ బాస్ నుంచి తీసేశారు. వాళ్ళు అలా చేయడం వల్ల ఏ ఆర్టిస్ట్ కి అయినా చాలా నష్టం. అందుకే నాకు నష్టపరిహారం కావాలని కోర్టుకి వెళ్ళాను. అయితే ఆ కేసుని మరో కోణంలోకి తీసుకెళ్లి నీరుగార్చేశారు. బిగ్ బాస్ ఆడిషన్స్ అని చెప్పి అమ్మాయిలని మాత్రం హోటల్స్ కి తీసుకెళతారు. అందుకే బిగ్ బాస్ ఆడిషన్స్ ఆఫీస్ లోనే నిర్వహించాలని కూడా పోరాటం చేసినట్లు గాయత్రీ గుప్తా చెప్పుకొచ్చింది. అయితే ఈ అమ్మ‌డు బిగ్ బాస్ ఆడిషన్స్ పేరుతో అమ్మాయిలని హోటల్ కి తీసుకెళతారని చెప్పిన కామెంట్స్ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

నాగార్జున గారిపై, బిగ్ బాస్ షోపై నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు కాని నేను పోరాటం చేసింది బిగ్ బాస్ షో నిర్వాహకులపైనే. నేను కోర్టుకు వెళ్లిన తర్వాత బిగ్ బాస్ రూల్స్ మార్చారు. ఆర్టిస్టులకు ఏదైనా నష్టం వాటిల్లితే నష్టపరిహారం కూడా చెల్లిస్తున్నారు. నేను చేసిన పోరాటం వ‌ల‌న ఇత‌రుల‌కి చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ విష‌యాన్ని బిగ్ బాస్ షోలో పాల్గొన్న చాలా మంది చెప్పుకు వ‌చ్చారంటూ గాయ‌త్రి గుప్తా తెలియ‌జేసింది. ఇకఇటీవ‌ల తన ఆరోగ్యం బాగా లేదని, ఇప్పటివరకు చాలా వరకు ఖర్చు అయ్యిందని, ట్రీట్ మెంట్ కోసం మొత్తం రూ. 12 లక్షలు ఖర్చు అవుతుందని, కానీ ఇప్పటివరకు లక్ష రూపాయలు కూడా అందలేదని చెప్పుకొచ్చింది గాయ‌త్రి గుప్తా.