Rashmika | ‘మైసా’ గా భయపెట్టనున్న రష్మికా మందనా

Rashmika | అందం..అభినయంతో పాన్ ఇండియా స్టార్ గా మారిన గ్లామర్ స్టార్ రష్మిక తన కొత్త సినిమాను ప్రకటించారు. ‘మైసా’ అనే సినిమాతో ఆమె వారియర్ పాత్రలో కనిపించబోతున్నారు. రవీంద్ర పూలే దర్శకత్వంలో ఐదు భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా నిర్మితమవుతున్న ‘మైసా’ మూవీ టైటిల్ పోస్టర్ ను నిర్మాణ సంస్థ అన్‌ఫార్ములా ఫిల్మ్స్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో రష్మిక భయపెట్టే ముఖంతో కనిపించింది. అందుకు తగ్గట్లుగానే ‘ధైర్యం ఆమె బలం..సంకల్పంలో లేదు కనికరం.. ఆమె గర్జన వినడానికి కాదు.. భయపెట్టడానికి’’..! అంటూ నిర్మాణ సంస్థ టైటిల్ పోస్టర్ షేర్ చేసింది. మైసా మూవీలో తన రోల్ పై రష్మిక స్పందించారు. ‘‘నేను ఎప్పుడూ కొత్తది, భిన్నమైనది, ఉత్తేజకరమైన చిత్రాలకు ప్రాధాన్యమిస్తానని..అలాంటి వాటిలో ‘మైసా’ ఒకటని చెప్పుకొచ్చారు. నేను ఇంతకు ముందెప్పుడూ పోషించని పాత్ర అని.. ఎప్పుడూ అడుగుపెట్టని ప్రపంచం.. ఇప్పటి వరకూ చేయని వెర్షన్..ఈ సినిమాను మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని.. ఃఇది ఆరంభం మాత్రమే..’’ అంటూ రష్మిక సినిమా వివరాలను వెల్లడించారు.
బాలీవుడ్ లో ‘సికందర్’ పరాజయంతో వెనుకబడిన రష్మికకు కుబేర సినిమా విజయంతో మళ్లీ విజయాల ట్రాక్ లో దూసుకెలుతుంది. రష్మిక ప్రధాన పాత్రలో నాయికా ప్రాధాన్యత చిత్రంగా రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’లో నటిస్తున్నారు. అలాగేఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో వస్తున్న ‘థామా’లోఆయుష్మాన్ ఖురానాకు జంటగా నటిస్తున్నారు. అతీంద్రియ శక్తులతో కూడిన ఓ రొమాంటిక్ చిత్రంగా ఇది రూపొందుతోంది. తాజాగా తాను ఇంతకుముందెన్నడు చేయని జోనర్ లో ‘మైసా’చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.