Spirit : ‘స్పిరిట్’ లో ప్రభాస్ తండ్రిగా చిరంజీవి ?
ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’లో చిరంజీవి తండ్రి పాత్రలో నటించబోతున్నారన్న టాక్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

విధాత : హీరో ప్రభాస్..దర్శకుడు సందీప్ రెడ్డి వంగా(Sandeep reddy Vanga) కాంబినేషన్ లో తెరకెక్కనున్న ‘స్పిరిట్'(Spirit) సినిమా నుంచి సంచలన విషయం ఒకటి సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ‘స్పిరిట్’ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas), మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi) తండ్రీకొడుకులుగా కనిపించబోతున్నారన్న ప్రచారం సినీ వర్గాల్లో జోరుగా సాగుతుంది. సందీప్ వంగా ‘యానిమల్’ సినిమాలో అనిల్ కపూర్(Anil Kapoor) పాత్ర తరహాలో.. ‘స్పిరిట్’ లో కూడా తండ్రి పాత్ర హైలైట్ గా ఉండబోతుందట. ఈ పవర్ ఫుల్ తండ్రి పాత్రలో చిరంజీవి నటిస్తారని సినీ వర్గాల టాక్. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ వార్త నిజమైతే మాత్రం ప్రభాస్, చిరు అభిమానులకు పండుగే అవుతుందంటున్నారు.
‘స్పిరిట్’ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో ప్రభాస్ మునుపెన్నపుడు చేయని పోలీస్ ఆఫీస్ పాత్రలో కనిపించబోతున్నారు. రాజాసాబ్(Rajasaab), ఫౌజీ(Fauji) సినిమాల తర్వాతా ప్రభాస్(Prabhas) ఆక్టోబర్ నుంచి ‘స్పిరిట్’ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.