పోలీసు సంక్షేమ నిధికి రూ. 8 లక్షల విరాళం
ఛామల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎలైట్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ ట్రోఫీ ని పోలీస్ క్రికెట్ టీం గెలుపొందింది. అక్టోబర్ 9 , 10 తేదీల్లో ఉప్పల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లో జరిగిన ఈ టోర్నమెంట్ ఫైనల్ లో టాలి వుడ్ టీం పై పోలీస్ క్రికెట్ టీం విజేతగా నిలిచింది.

హైదరాబాద్, అక్టోబర్ 21(విధాత): ఛామల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎలైట్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ ట్రోఫీ ని పోలీస్ క్రికెట్ టీం గెలుపొందింది. అక్టోబర్ 9 , 10 తేదీల్లో ఉప్పల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లో జరిగిన ఈ టోర్నమెంట్ ఫైనల్ లో టాలి వుడ్ టీం పై పోలీస్ క్రికెట్ టీం విజేతగా నిలిచింది. విన్నర్ టీమ్ కు లభించిన ఐదు లక్షలు, రన్నర్ టీమ్ కు లభించిన 3 లక్షల రూపాయల నగదు బహుమతిని పోలీసు అమరవీరుల సంస్మరణ దినం పురస్కరించుకొని పోలీసు సంక్షేమ నిధికి అందచేస్తూ ఈ చెక్కును రాష్ట్ర ప్రభుత్వ హోమ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శ సీవీ ఆనంద్ కు నేడు సచివాలయంలో నిర్వాహకులు అందచేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ క్రికెట్ టీమ్ సభ్యులతో పాటు, బీసీసీఐ, ప్రణవ గ్రూప్ ప్రతినిధులు పాల్గొనున్నారు.