బీఆర్ఎస్ చీలికకు హరీశ్ రావు కారణం: మంత్రి అడ్లూరి
సచివాలయంలో మంత్రి అడ్లూరి మీడియాతో చిట్ చాట్ చేశారు. సీనియర్ మంత్రిగా అనుభవం ఉన్న హరీశ్ రావు క్యాబినెట్‌ను అవమానించారు. హరీశ్ రావు లెక్క పైకి నవ్వి.. లోపల రాజకీయాలు చేయడమ తెలియవన్నారు. బీఆర్ఎస్ పార్టీ చీలికకు హరీశ్ రావు కారణం కాదా? అని ప్రశ్నించారు.

హైదరాబాద్, అక్టోబర్ 21(విధాత): సచివాలయంలో మంత్రి అడ్లూరి మీడియాతో చిట్ చాట్ చేశారు. సీనియర్ మంత్రిగా అనుభవం ఉన్న హరీశ్ రావు క్యాబినెట్‌ను అవమానించారు. హరీశ్ రావు లెక్క పైకి నవ్వి.. లోపల రాజకీయాలు చేయడమ తెలియవన్నారు. బీఆర్ఎస్ పార్టీ చీలికకు హరీశ్ రావు కారణం కాదా? అని ప్రశ్నించారు. హరీశ్ రావు బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత రాజకీయాలు చేయడం మాకు తెలుసు అని అన్నారు. పైకి నవ్వుతూ.. లోపల కార్పొరేట్ రాజకీయాలు మాకు చేయడం చేత కాదన్నారు. హరీశ్ రావు లెక్క యాస – భాష మాకు తెలీదు.. ప్రజలకు సేవ చేయడం మాత్రమే తెలుసన్నారు. ప్రజలు మాకు ఐదేళ్లు ఇచ్చారు.. 22 నెలలకే ఎందుకు అంత ఆక్రోశమని అన్నారు. హరీశ్ రావు, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ లెక్కలు అన్ని మా దగ్గర కుప్పలు కుప్పలు ఉన్నాయని మంత్రి అన్నారు. రేపు శనివారం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిండు స్నానం చేస్తా.. క్యాబినెట్ ను అవమానించడంతో క్యాబినెట్ కు పట్టిన మకిలిని కడిగేస్తామన్నారు.
హరీశ్ రావుకి మంత్రి అడ్లురి ఛాలెంజ్
మాజీ మంత్రి హరీశ్ రావుకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఛాలెంజ్ విసిరారు.క్యాబినెట్ సమావేశంలో వ్యక్తిగత అంశాలు చర్చించినట్లు హరీశ్ రావు ఆరోపించారని ఆరోపణలు ఈ పూర్తిగా అవాస్తవమన్నారు. మంగళవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. క్యాబినెట్‌లో వ్యక్తిగత విషయాలు చర్చించలేదని నేను, మా తల్లిదండ్రులపై ప్రమాణం చేసి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణం చేస్తాను, హరీశ్ రావు సెంటిమెంట్‌గా భావించే సిద్ధిపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణం చేస్తారా అని ఛాలెంజ్ చేశారు. హరీశ్ ఆరోపించిన విషయాలను నిజమని ప్రమాణం చేయగలవా? అని ప్రశ్నించారు.
హరీశ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి, క్యాబినెట్ పై బీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. క్యాబినెట్ మంత్రులను దండుపాళ్యం బ్యాచ్ అంటారా అని మండిపడ్డారు. హరీశ్ రావు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది. క్యాబినెట్లో జరగని విషయాలను జరిగాయని ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. బీఆర్ఎస్ పార్టీ అబద్దాలకు కేరాఫ్ అడ్రస్ అని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలపై దాదాపు 600 పైగా ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులపై గత ప్రభుత్వం క్రూరంగా ప్రవర్తించిందన్నారు. రైతుల చేతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానిదని విమర్శించారు. పదేండ్లు మేమే రాజులం మేమే మంత్రులం అన్నట్టు వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.