వైరల్ గా మారిన విరాట్ కోహ్లీ పోస్టు

టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ తాజాగా ఇన్ స్టాలో పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. తన సతీమణి అనుష్క శర్మతో కలిసి ఉన్న ఒక ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు.

వైరల్ గా మారిన విరాట్ కోహ్లీ పోస్టు

విధాత : టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ తాజాగా ఇన్ స్టాలో పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. తన సతీమణి అనుష్క శర్మతో కలిసి ఉన్న ఒక ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. ‘‘చాలా కాలం తర్వాత..’’ అంటూ దానికి క్యాప్షన్‌ ఇచ్చాడు. దీంతో ఈ పోస్టు ఇంటర్నెట్‌ను షేక్‌ చేసింది. పోస్టు పెట్టిన 15 గంటల్లోనే దీనికి 9 మిలియన్లకుపైగా లైక్స్‌ వచ్చాయి. అసలే అభిమానుల్లో విరుష్క జంటగా పేరొందిన కోహ్లీ అనుష్క దంపతులు ఏం చేసినా అది వారికి వైరల్ గా మారిపోతుంది.

ఇక కోహ్లీ టీ20లు, టెస్టులకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. వన్డేల్లోనే కొనసాగుతున్న కోహ్లీ ప్రస్తుతం కుటుంబంతో కలిసి లండన్‌లో ఉంటున్నాడు. త్వరలో జరగబోయే అస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు. చివరిసారిగా ఐపీఎల్‌లో ఆడిన కోహ్లీ తన జట్టు ఆర్సీబీకి తొలి టైటిల్‌ను అందించిన సంగతి తెలిసిందే.