Women’s World Cup 2025 : ఒక్క సీటు – మూడు జట్లు : ఉత్కంఠభరితంగా ప్రపంచకప్ సెమీస్ రేసు
మహిళల ప్రపంచకప్ 2025లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరాయి. భారత్, న్యూజిలాండ్, శ్రీలంక మధ్య చివరి స్థానం కోసం ఉత్కంఠభరిత పోరు కొనసాగుతోంది.

Four Teams Battle for One Semi-Final Spot in Women’s World Cup 2025
(విధాత స్పోర్ట్స్ డెస్క్)
మహిళల ప్రపంచకప్ 2025లో పోటీ ఉత్కంఠభరితంగా మారింది. సోమవారం శ్రీలంక చేతిలో బంగ్లాదేశ్ ఏడు పరుగుల తేడాతో ఓడిపోవడంతో ఆ జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు సెమీఫైనల్స్‌కి అర్హత సాధించాయి. ఇక మిగిలిన ఒక స్థానం కోసం భారత్, న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య ఆసక్తికర పోరు కొనసాగుతోంది. ఇంకా ఆరు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈరోజు జరిగిన పాకిస్తాన్, దక్షిణాఫ్రికా జట్ల పోటీలో సౌతీస్ ఘనవిజయం సాధించింది. వరుణుడు కూడా ఆడిన ఈ మ్యాచ్‌లో DLS ద్వారా సవరించిన లక్ష్యాన్ని అందుకోలేక పాకిస్తాన్ ఇంటిముఖం పట్టింది.
భారత్ (5 మ్యాచ్‌లు, 2 విజయాలు, 4 పాయింట్లు, నెట్ రన్రేట్ : +0.526):
భారత్ అవకాశాలను ఒకసారి పరిశీలిద్దాం..
- భారత్ గురువారం న్యూజిలాండ్‌పై గెలిస్తే నేరుగా సెమీఫైనల్‌కు చేరుతుంది.
- ఓడితే మాత్రం, న్యూజిలాండ్ ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయి, భారత్ బంగ్లాదేశ్‌పై గెలవాలి.
- వర్షం కారణంగా భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ రద్దయినా, తర్వాత బంగ్లాదేశ్‌పై భారత్ ఓడిపోయినా, న్యూజిలాండ్ కనుక ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోతే భారత్‌కు అవకాశం ఉంటుంది.
- రెండు మ్యాచ్‌లు వర్షం వల్ల రద్దయినా, ఇంగ్లాండ్ న్యూజిలాండ్‌ను ఓడిస్తే భారత్ సెమీఫైనల్ చేరుతుంది. ఆ సందర్భంలో శ్రీలంక 6 పాయింట్లతో సమానమైతే, భారత్ మెరుగైన నెట్‌రన్‌రేట్‌తో ముందుంటుంది.
ఇదీ ఇండియా పొజిషన్. అయితే దాదాపుగా అవకాశాలైతే ఉన్నాయి. ఏదైనా ‘దారుణం’ జరిగితే తప్ప భారత్ సెమీస్కు వెళ్లే ఛాన్స్‌లు పుష్కలంగా ఉన్నాయి.
న్యూజిలాండ్ (5 మ్యాచ్‌లు, 1 విజయం, 4 పాయింట్లు, నెట్ రన్రేట్ : -0.245):
ఇక న్యూజిలాండ్‌కు భారత్‌తో “డూ ఆర్ డై” మ్యాచ్. ఓడిపోయారూ అంటే వారికీ కప్పు కల ముగిసినట్టే. రెండు మ్యాచ్‌లు వర్షార్పణం కావడంతో రెండు పాయింట్లే వచ్చాయి. రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే నేరుగా సెమీఫైనల్‌కు చేరతారు. భారత్‌పై గెలిచి, ఇంగ్లాండ్‌పై ఓడిపోతే, భారత్ బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోవాలని వేచి చూడాలి. శ్రీలంక పాకిస్తాన్‌పై గెలిస్తే 6 పాయింట్లతో సమానమవుతుంది. కానీ ప్రస్తుతం న్యూజిలాండ్‌కి మెరుగైన నెట్‌రన్‌రేట్ ఉంది. భారత్‌పై గెలిచి, ఇంగ్లాండ్‌తో మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే మాత్రం, 7 పాయింట్లతో ఇతర ఫలితాలపై ఆధారపడకుండా న్యూజిలాండ్‌కి సెమీఫైనల్ సీటు దక్కుతుంది.
శ్రీలంక (6 మ్యాచ్‌లు, 1 విజయం, 4 పాయింట్లు, నెట్ రన్రేట్ : -1.035):
శ్రీలంకకి సెమీఫైనల్ అవకాశం బతికి ఉండాలంటే పాకిస్తాన్‌పై గెలవాలి. వీరికీ రెండు మ్యాచ్‌లు వర్షార్పణం కావడంతో రెండు పాయింట్లే వచ్చాయి. భారత్ మిగిలిన రెండు మ్యాచ్(న్యూజీలాండ్, బంగ్లాదేశ్)ల్లో ఓడిపోవాలి. అలాగే ఇంగ్లాండ్ న్యూజిలాండ్‌ను చివరి రోజు ఓడించాలి. అయితే, నెట్‌రన్‌రేట్ తేడాతో శ్రీలంక వెనకబడే అవకాశం ఉంది కాబట్టి పాకిస్తాన్‌పై భారీ విజయం తప్పనిసరి.
బంగ్లాదేశ్ నిన్నటి ఓటమి వల్ల, పాక్ ఈనాటి పరాజయం వల్ల ప్రపంచకప్ నుంచి నిష్క్రమించాయి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు ఏ ఇబ్బంది పడకుండా సెమీస్కు చేరుకున్నాయి. మిగిలిన ఒక్క బెర్తు కోసమే ఇక మిగిలిన పోటీలు.
In the Women’s World Cup 2025, Australia, South Africa, and England have already secured their semi-final berths. The fight for the last remaining spot is between India, New Zealand, Sri Lanka, and Pakistan. India can qualify directly by defeating New Zealand, while the other teams depend on various match outcomes, net run rate factors, and possible rain washouts. With only one semi-final slot left and seven league games remaining, the tournament’s end phase promises high drama and suspense.