Hari Hara Veera Mallu | ‘హరిహర వీరమల్లు’ సినిమా టికెట్ రేట్లు పెంపు

Hari Hara Veera Mallu | ‘హరిహర వీరమల్లు’ సినిమా టికెట్ రేట్లు పెంపు

Hari Hara Veera Mallu | విధాత, హైదరాబాద్ : ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) నటించిన పిరియాడిక్ యాక్షన్ మూవీ హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu) కోసం పవన్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. పవన్ సరసన నిధి అగర్వాల్(Nidhhi Agerwal) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే హరిహరవీరమల్లు సినిమా విడుదలైన మొదటి రెండు వారాలు టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతి ఇవ్వాలన్న చిత్ర నిర్మాత అభ్యర్థనకు ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఒక్కో టికెట్‌పై సింగిల్ స్క్రీన్‌లో లోయర్ క్లాస్ టికెట్ పై రూ.100, అప్పర్ క్లాస్ టికెట్ పై రూ.150, మల్టీప్లెక్స్‌లో రూ.200 వరకు పెంచుకునేందుకు అనుమతించింది.

ఇటు తెలంగాణలో కూడా హరిహరవీరమల్లు(Hari Hara Veera Mallu) సినిమా టికెట్‌ ధరలను పెంచాలని కోరుతూ నిర్మాత ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. దీనిపైనా ఇంకా తెలంగాణ ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడాల్సి ఉంది. బెనిఫిట్‌ షోల విషయంలోనూ స్పష్టత రాలేదు.