Pawan Kalyan: కొల్లగొట్టేస్తోన్న.. హరిహర వీరమల్లు

విధాత: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న కొత్త చిత్రం హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu). శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా వస్తుండగా మొదటి భాగాన్ని మార్చి28న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. రత్నం తనయుడు జ్యోతికృష్ణ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు తీసుకోగా నిధి అగర్వాల్ (Nidhhi) కథానాయికగా నటిస్తోంది. ఆస్కార్ విన్నర్ కీరవాణి (MM Keeravaani) సంగీతం అందిస్తున్నాడు.
ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్‌లో ఉండడంతో మేకర్స్ శివరాత్రిని పురస్కరించుకుని ఈ మూవీ నుంచి కొల్లగొట్టినాదిరో (Kollagottinadhiro) అంటూ సాగే ఓ పాటను రిలీజ్ చేశారు. చంద్రబోస్ సాహిత్యం అందించగా మంగ్లీ (Mangli), రాహుల్ సిప్లీగంజ్ (Rahul Sipligunj) , రమ్యా బెహార(Ramya Behara), యామిని ఘంటసాల (Yamini Ghantasala) ఆలపించారు.