Harish Shankar| ఢీ అంటే ఢీ.. ట్విట్ట‌ర్‌లో మీడియా వ్య‌క్తితో హ‌రీష్ శంక‌ర్ కోల్డ్ వార్.. కార‌ణం ఏంటంటే..!

Harish Shankar| టాలీవుడ్ పాపుల‌ర్ డైరెక్ట‌ర్స్‌లో హ‌రీష్ శంక‌ర్ ఒకరు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో గ‌బ్బ‌ర్ సింగ్ అనే చిత్రం చేసి మంచి హిట్ అందుకున్న హ‌రీష్ శంక‌ర్ ఇప్పుడు ప‌వ‌న్‌తోనే భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ అనే చిత్రం చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అ

  • By: sn    cinema    Jul 27, 2024 7:40 AM IST
Harish Shankar| ఢీ అంటే ఢీ.. ట్విట్ట‌ర్‌లో మీడియా వ్య‌క్తితో హ‌రీష్ శంక‌ర్ కోల్డ్ వార్.. కార‌ణం ఏంటంటే..!

Harish Shankar| టాలీవుడ్ పాపుల‌ర్ డైరెక్ట‌ర్స్‌లో హ‌రీష్ శంక‌ర్ ఒకరు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో గ‌బ్బ‌ర్ సింగ్ అనే చిత్రం చేసి మంచి హిట్ అందుకున్న హ‌రీష్ శంక‌ర్ ఇప్పుడు ప‌వ‌న్‌తోనే భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ అనే చిత్రం చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ మొద‌ల‌య్యే లోపు ర‌వితేజ‌తో చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా హిట్ సాధిస్తుంద‌నే ఆశ‌లో ఉన్నాడు. ఇక సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హ‌రీష్ శంక‌ర్ త‌న‌పై విమ‌ర్శ‌లు చేసే వారికి గ‌ట్టిగా బ‌దులు ఇస్తుంటాడు. బీవీఎస్ రవితో ఆ మధ్య హరీష్ శంకర్ వాగ్వాదం, ట్వీట్ల పోరు ఎంత‌లా జరిగిందో మనం చూశాం. బాహా బాహిగా ఇద్ద‌రు తిట్టుకోవ‌డంతో వారిపై అంద‌రిలో చుల‌క‌న భావం ఏర్ప‌డింది.

ఇక ఇప్పుడు ఓ మీడియా ప‌ర్స‌న్‌తో హ‌రీష్ శంక‌ర్ ట్విట్ట‌ర్‌లో వాద‌నకి దిగాడు.తాజాగా డిస్ట్రిబ్యూట‌ర్ లెక్క‌లు చెప్పాడ‌ని ఓ వ్య‌క్తి లెక్క‌లు బ‌య‌ట‌పెట్టాడు. అలా లెక్కలు బ‌య‌టపెట్టడంతో హరీష్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. మీకు ఇంటర్వ్యూ ఇద్దామని అనుకున్నా.. ప్రస్తుతానికి ఇది రిక్వెస్ట్ మాత్రమే అని కాస్త సెటైరికల్‌గా ట్వీట్ వేశాడు. దానికి అవతలి వ్యక్తి కూడా తగ్గేదేలే అన్నట్టుగా ఘాటు రిప్లై ఇచ్చాడు. ఇక్కడ నేను చేసిన తప్పు ఏమిటి? డిస్ట్రిబ్యూటర్ చెప్పింది వేయడమా? మీ ఇంటర్వూ నేనేమీ అడగలేదే నేను తప్పు అంకె వేస్తే ఖండించండి రిక్వెస్ట్ కాదు..వార్నింగ్ అయినా…తప్పు చేస్తే భయపడాలి అని ఘాటుగా కౌంటర్ వేశాడు. దీనికి హరీష్ శంకర్ కూడా కౌంటర్ వేశాడు.

మీరు తప్పు చేశారు అని నేను అనుకొని ఉంటే రిక్వెస్ట్ అనే వాడిని కాదు.. ట్రాన్సాక్షన్ ఇద్దరి మధ్య జరిగినప్పుడు ఇద్దరితో కన్ఫామ్ చేసుకోవాలి.. మీరు ఇంటర్వ్యూ అడిగారని ఒక వ్యక్తి నాకు చెప్పాడు.. ఎలాగైతే మీకు ‘ఒక’ డిస్ట్రిబ్యూటర్ చెప్పినట్టు.. అని కౌంటర్ వేశాడు. అనంత‌రం హరీష్ శంకర్ ట్వీట్‌కి సదరు వ్యక్తి రిప్లై ఇచ్చాడు. ‘నేను మీ ఇంటర్వూ కావాలని అడగలేదు. మరోసారి క్లారిటీగా చెబుతున్నా మీ పీఆర్ ఫోన్ చేసి, హరీష్ గారు మీకు ఫస్ట్ ఇంటర్వూ ఇస్తారట కానీ ఆయన కెమేరా కూడా పెట్టుకుంటారట మీకు ఓకెనా అని అడిగారు దానికి నేను ఓకె..వన్ సెకెండ్ కూడా కట్ చేయకుండా అప్ లోడ్ చేస్తాను అని చెప్పాను. కొన్నవారే ఇంతకు కొన్నాము అని చెప్పింది వేసాను. ఇది రెగ్యులర్ ప్రాక్టీస్..మీ సినిమా విషయంలో మాత్రమే కాదు. న్యూస్ సేకరించడం అన్నది నా వృత్తి’ అని సమాధానం ఇచ్చాడు.

దానికి హ‌రీష్ శంక‌ర్ స్పందిస్తూ.. మీరు ఒక సారి ఇంటర్వ్యు ఇస్తా అని ఇవ్వలేదంట “అన్నప్పుడు.. సరే … ఈసారి ఆయనతోనే మొదలెడదాం….అన్నాను !!! .. ఇది నా వైపు నుండి క్లారిటీ !!! .. ఇక పోతే …. గతంలో భవదీయుడు భగత్ సింగ్ టైటిల్ లీక్ చేసిన మీరు తప్పు ,ఒప్పు అంటూ డిస్కషన్ పెట్టకండి … మీకు సూట్ అవ్వదు.. కేవలం మీ సోషల్ మీడియా పరపతి పెంచుకోడానికి డీటైల్స్ లీక్ చేసి దాని తాలూకా అధికారిక ప్రకటన చేసే నిర్మాణ సంస్థల నుంచి వచ్చే కిక్కుని పాడు చేసే మీలాంటి వాళ్లు తప్పొప్పులు మాట్లాడటం చూస్తే నవ్వొస్తుంది.. నేను డైరెక్టర్ కాబట్టి ఇంకా మర్యాదగా మాట్లాడుతున్న … అని అన్నాడు. ఇలా హ‌రీష్ శంకర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స‌ద‌రు వ్య‌క్తితో గ‌ట్టిగా వార్‌కి దిగాడు.