Grace Cancer Run | క్యాన్సర్‌పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి
Grace Cancer Run | గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం నిర్వహించిన గ్రేస్ క్యాన్సర్ రన్‌లో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, శాట్ చైర్మన్ శివసేన రెడ్డి పాల్గొన్నారు.

క్యాన్సర్ చికిత్సకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది
గ్రేస్ క్యాన్సర్ రన్‌లో మంత్రులు
Grace Cancer Run | హైదరాబాద్, అక్టోబర్ 12 (విధాత): గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం నిర్వహించిన గ్రేస్ క్యాన్సర్ రన్‌లో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, శాట్ చైర్మన్ శివసేన రెడ్డి పాల్గొన్నారు. గ్రేస్ క్యాన్సర్ రన్ లో విద్యార్థులు ,యువత భారీగా పాల్గొన్నారు. అనంతరం క్యాన్సర్ పై అవగాహన రన్ లో 2k, 5k విజేతలకు మంత్రులు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా క్యాన్సర్ పై అవగాహన కలగడానికి గ్రేస్ క్యాన్సర్ రన్ నిర్వహించిన నిర్వాహకులకు మంత్రులు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత మంత్రులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు క్యాన్సర్ పై అవగాహన కలిగి ఉండాలన్నారు. మన జీవితంలో నుంచి ప్లాస్టిక్ ను దూరం చేసినప్పుడే క్యాన్సర్ ను నివారించవచ్చు అని మంత్రి పొన్నం వెల్లడించారు. క్యాన్సర్ చికిత్సకు ప్రాజా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని మంత్రులు పేర్కొన్నారు.