Ravi Teja| చీరకొంగులో చేయి పెట్టిన రవితేజ.. ట్రోల్స్‌పై హరీష్ శంకర్ క్లారిటీ..!
Ravi Teja| దర్శకుడు హరీష్ శంకర్ ఈ మధ్య పెద్దగా హిట్ సినిమాలు తీయడం లేదు. ఆయన నుండి హిట్ వచ్చి చాలా రోజులు అయింది. పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలని అనుకోగా, పవర్ స్టార్ బిజీ షెడ్యూల్స్ వలన అది పోస్ట్ పోన్ అయింది. అయితే ఈ లోపు రవితేజతో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేశాడు. మా

Ravi Teja| దర్శకుడు హరీష్ శంకర్ ఈ మధ్య పెద్దగా హిట్ సినిమాలు తీయడం లేదు. ఆయన నుండి హిట్ వచ్చి చాలా రోజులు అయింది. పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలని అనుకోగా, పవర్ స్టార్ బిజీ షెడ్యూల్స్ వలన అది పోస్ట్ పోన్ అయింది. అయితే ఈ లోపు రవితేజతో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేశాడు. మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకులు ముందుకొచ్చింది. అయితే ఈ సినిమా అంచనాలు అందుకోవడం ఫెయిల్ అయిందని తెలుస్తోంది. సినిమా చూసిన వారు దారుణంగా తిట్టిపోస్తున్నారు. మూవీపై తీవ్రమైన ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. రవితేజ లైఫ్ ఇస్తే , ఆయన లైఫ్‌తోనే హరీష్ శంకర్ ఆడుకున్నాడంటూ హరీష్ శంకర్‌ని ఆడేసుకుంటున్నారు.
హీరోయిన్‌ను కేవలం గ్లామర్‌కే పరిమితం చేశారని, కథను బాగా సాగదీశాడని , మీడియా అటెన్షన్‌పై ఉన్న శ్రద్ద సినిమాపై పెడితే బాగుండేదని విమర్శిస్తున్నారు. రవితేజ అభిమానులు హరీష్ శంకర్‌పై గుర్రుగా ఉన్నారు.అయితే బయట సంగతి ఎలా ఉన్నా కూడా సినిమా టీం మాత్రం సక్సెస్ సెలెబ్రేషన్స్ అంటూ ప్రెస్ మీట్ పెట్టింది. నిర్మాత, దర్శకుడు, హీరోయిన్ ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మాట్లాడారు. ఇక నెగెటివ్ రివ్యూలు, రేటింగ్‌ల మీద హరీష్ శంకర్ స్పందిస్తూ… తన సినిమా అందరికీ నచ్చాలనే అత్యాశ లేదన్నట్టుగా చెప్పుకొచ్చాడు. మిక్స్డ్ రివ్యూలు,రేటింగ్‌లు తనకు కొత్తేమీ కాదని, షోలు పెరుగుతున్న కొద్దీ పాజిటివ్ టాక్ వస్తోందని, మరిన్ని షోలు యాడ్ అవుతున్నాయని హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు.
ఇక ఈ సినిమాను భాగ్య శ్రీ కోసమే తీసినట్టుగా ఉందని, సినిమాలో పాటలు కాకుండా.. పాటల కోసమే సినిమాను తీసినట్టుగా ఉందని ట్రోలింగ్ జరుగుతుంది. సితార అనే పాటలో స్టెప్పులు కూడా దారుణంగా ఉన్నాయని, చూడటానికి కూడా ఎబ్బెట్టుగా ఉన్నాయని ట్రోలింగ్ చేస్తున్నారు. దీనిపై హరీష్ శంకర్ తన వివరణ ఇచ్చాడు. ఆ డ్యాన్స్ మూమెంట్స్ తనకు కూడా అంత ఇష్టం లేదని.. కానీ శేఖర్ మాస్టర్ మొదటి రోజే అలా స్టెప్పులు కంపోజ్ చేయడం, తనకి నచ్చలేదని చెబితే ఎక్కడ ఫీలవుతారో అని చెప్పలేదంటూ శంకర్ వివరణ ఇచ్చాడు. మూవ్‍లో వెళ్లిపోతే చూసేందుకు ఎబ్బెట్టుగా అనిపించవు. ఎప్పుడైతే మూవ్‍మెంట్‍ను పాస్ చేసి ఫొటోలాగా తీస్తే.. ఏ పాటలో చూసినా ఇబ్బంది కలిగేలా చేయవచ్చు అని కూడా తెలియజేశాడు