V Hanumantha Rao | బీసీ ర్యాలీలో కిందపడిన వీహెచ్

బీసీ రిజర్వేషన్ల కోసం జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు (వీహెచ్) ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. బ్యానర్ కాలికి తగలడం వల్ల కిందపడగా, స్వల్ప విరామం తర్వాత ర్యాలీ కొనసాగించారు.

V Hanumantha Rao | బీసీ ర్యాలీలో కిందపడిన వీహెచ్

విధాత, హైదరాబాద్ : బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్ తో బీసీ సంఘాలు శనివారం నిర్వహించిన బీసీ బంద్ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగింది. హైదరాబాద్ లో బంద్ సందర్భంగా కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీలో సినీయర్ నాయకులు, మాజీ ఎంపీ వి.హనుమంత రావు ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా..వీహెచ్ కు ఏమైందోనని కాంగ్రెస్ శ్రేణులు కంగారుపడిపోయాయి.

ర్యాలీలో సహచర నాయకులతో కలిసి బ్యానర్ పట్టుకుని ముందు నడుస్తుండగా..బ్యానర్ కాలి కింద పడటంతో వీహెచ్ అకస్మాత్తుగా ముందుకు తూలిపోయి రోడ్డుపై పడిపోయాడు. తమకళ్ల ముందే సీనియర్ నేత హనుమంతరావు అకస్మాత్తుగా కిండపడిపోవడంతో అక్కడున్న వారంతా కంగారుపడి ఆయనను వెంటనే పైకి లేపి సపర్యలు చేశారు. బ్యానర్ కారణంగానే కిందపడిపోయారని గుర్తించి..హమ్మయ్య మన హనుమన్నకు ఏం కాలేదనుకుంటూ..ఆయనతో పాటు వారంతా తమ ర్యాలీ కొనసాగించారు.