HEMA|నేనేమైన టెర్రరిస్ట్‌నా.. చనిపోతే కూడా ఇలానే చేస్తారంటూ కన్నీరు పెట్టుకున్న హేమ
HEMA| కొద్ది రోజుల కిందట హేమ పేరు ఎంత హాట్ టాపిక్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ దొరకడం, ఆమె బ్లడ్ శాంపిల్స్ చెక్ చేస్తే పాజిటివ్‌గా రావడంతో న్యూస్ ఛానెల్స్ లో హేమ పేరు మారుమ్రోగింది. అయితే అసలు ఏం జరిగిందో తాను వివరిస్తా

HEMA| కొద్ది రోజుల కిందట హేమ పేరు ఎంత హాట్ టాపిక్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ దొరకడం, ఆమె బ్లడ్ శాంపిల్స్ చెక్ చేస్తే పాజిటివ్‌గా రావడంతో న్యూస్ ఛానెల్స్ లో హేమ పేరు మారుమ్రోగింది. అయితే అసలు ఏం జరిగిందో తాను వివరిస్తానని అంటున్నా కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్లు వార్తలు రాసేసారు. బ్రేకింగ్ న్యూస్‌లతో బెంబేలెత్తించారు.ఇక ఇటీవల హేమ బెయిల్‌పై బయటకు వచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హేమ ఆ నాటి పరిస్థితుల గురించి క్లారిటీ ఇచ్చింది. తాను రేవ్ పార్టీకే వెళ్లలేదని.. బర్త్ డే పార్టీకి మాత్రమే వెళ్లాలని అని పేర్కొంది.
రేవ్ పార్టీ ఆదివారం జరిగిందని.. తాను శనివారం నాడే బర్త్ డే పార్టీకి వెళ్లి వచ్చేశానని.. తాను శాంపిల్స్ ఇవ్వకుండానే పాజిటివ్ వచ్చాయని తప్పుడు కథనాలు ప్రసారం చేశారని, నన్ను చాలా బద్నాం చేసారని హేమ వాపోయింది. బ్రేకింగ్ న్యూస్.. బ్రేకింగ్ న్యూస్.. హేమ అది చేసిందీ.. హేమా ఇది చేసింది అని ఒకటే బ్రేకింగ్. నేనేమైనా టెర్రరిస్ట్‌నా? ఎంతమందిని చంపేశాను. బెల్డ్ బాంబ్‌లు ఏమైనా పెట్టుకుని వెళ్లానా? గతంలో పూరీ గారు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నప్పుడు ఇండస్ట్రీ సపోర్ట్ చేయలేదు కదా. నాకు మంచు విష్ణు సపోర్ట్‌గా నిలిచారు. మిగతా వారంతా కూడా నా వెంటే ఉన్నారు. అయిన నేను వెళ్లింది బర్త్ డే పార్టీకి మాత్రమే.
నా తమ్ముడిలాంటి వాడితో వెళ్లాను. రేపు తీర్పు వచ్చినప్పుడు తెలుస్తుంది. నేను పార్టీకి వెళ్లానా? లేదా? డ్రగ్స్ తీసుకున్నానా లేదా? అని. నేను అన్ని టెస్ట్‌లు చేయించుకున్నా.. అన్నీ నెగిటివ్ వచ్చాయి. అవన్నీ మా అసోసియేషన్‌కి వచ్చాయి. నేను తప్పు చేయనని తెలిసి వారు తిరిగి ‘మా’ కార్డ్ ఇచ్చేశారు. 35 ఏళ్లు ఇండస్ట్రీలో ఉన్నా.. నాపై ఒక్క రిమార్క్ లేదు. కానీ నన్ను టెర్రరిస్ట్‌కంటే దారుణంగా చూపించారు మీడియాలో. మా అమ్మ అవి చూసి వారం రోజులు తిండి తనలేదు. మా అమ్మకి ఏమైన అయ్యి నేను చనిపోతే, నా శవంపై కూడా తప్పుడు రాతలు రాస్తారు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది . ముక్కుసూటిగా వెళ్లేవాళ్లూ.. ప్రశ్నించే వాళ్లు తప్పుచేయరు. నా బాధ చెప్పుకుంటే ఓవరాక్షన్ అంటున్నారు.. ఇంకేం చేయాలి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది హేమ.