Heroine| క్యాన్సర్‌తో పోరాడుతున్న అందమైన హీరోయిన్.. ఏకంగా గుండు కూడా చేసేసుకుందిగా…!
Heroine| ఇటీవల అందాల భామలు కొందరు క్యాన్సర్ బారిన పడి అనేక ఇబ్బందులకి గురవుతుండడం మనం చూస్తున్నాం. అయితే క్యాన్సర్ బారిన పడిన భామలు ఏ మాత్రం అధైర్యపడకుండా తమ ఆరోగ్యం గురించి అభిమానులకి ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ బుల్లితెర హీరోయిన్ హీనాఖాన్.. బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్టు తెలియజేసింది. తనకి క్యాన్సర్ ఉందని తెలిసిన కూడా ఏ మాత్రం అధైర్యపడకుండా, మానసికంగా కుంగిపోకుం

Heroine| ఇటీవల అందాల భామలు కొందరు క్యాన్సర్ బారిన పడి అనేక ఇబ్బందులకి గురవుతుండడం మనం చూస్తున్నాం. అయితే క్యాన్సర్ బారిన పడిన భామలు ఏ మాత్రం అధైర్యపడకుండా తమ ఆరోగ్యం గురించి అభిమానులకి ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ బుల్లితెర హీరోయిన్ హీనాఖాన్.. బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్టు తెలియజేసింది. తనకి క్యాన్సర్ ఉందని తెలిసిన కూడా ఏ మాత్రం అధైర్యపడకుండా, మానసికంగా కుంగిపోకుండా వ్యాధికి చికిత్స తీసుకుంటుంది. ఓ వైపు క్యాన్సర్ కు ట్రీట్ మెంట్ తీసుకుంటూ.. మరోవైపు షూటింగ్ లకు కూడా వెళుతుందట. అయితే తనకు థర్డ్ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉండడంతో కీమో థెరపీ చికిత్స తీసుకుంది.
ఆ చికిత్స వల్ల హీనా ఖాన్ ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుంది. అలాగే ఆమె జుట్టుకూడా రాలిపోతోంది. ఆ కారణంగా, హీనా ఖాన్ తన తల మొత్తం షేవ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. క్యాన్సర్ చికిత్స సమయంలో రోజు రోజుకి నెమ్మదిగా జుట్టు రాలిపోతూ ఉంటుంది . మహిళలకు జుట్టు రాలిపోతే చాలా చిరాకుగా ఉంటుంది కదా. అందుకే దీన్ని వదిలించుకోవడానికి తన తల మొత్తం గుండు చేసుకుంది హీనా ఖాన్. అవసరమైనప్పుడు విగ్గు పెట్టుకుంటానని తెలిపింది ఆమె. హీనా ఖాన్ తన తల షేవ్ చేసుకున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది చూసిన ఆమె అభిమానులు ధైర్యం చెబుతున్నారు.
‘మీరు త్వరగా కోలుకోవాలని’ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. హీనా ఖాన్.. ఏ రిస్తా క్యా కెహ్‌లాతా హై’తో సీరియల్ తో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను దోచేసింది. ఈమె ఇప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో క్యాన్సర్ మహమ్మారితో పోరాటం చేస్తుంది. హీనా ఖాన్ తనకు క్యాన్సర్ అని తెలిసినప్పటి నుంచి కూడా అభిమానులతో ప్రతి విషయాన్ని పంచుకుంటుంది. క్యాన్సర్ అని తెలిసిన హీనాఖాన్ ఏ మాత్రం భయపడలేదు. దైర్యంగా ఈ భయంకర వ్యాధితో పోరాడుతూనే ఉంది. ఆమె మహమ్మారిని ఎదిరించి ధైర్యంగా మనముందుకు వస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.