Hyper Aadi|హైప‌ర్ ఆది నా క‌డుపు కొట్టాడు.. పెళ్లి చేసుకోవల్సిందే అంటున్న రోహిణి

Hyper Aadi| అతి త‌క్కువ టైమ్‌లోనే స్టార్ స్టేట‌స్ సంపాదించాడు హైపర్ ఆది. అదిరిపోయే టైమింగ్‌తో పాటు ఆకట్టుకునే పంచులు ప్రేక్ష‌కుల‌ని క‌డుపుబ్బ న‌వ్విస్తాయి. ప్ర‌స్తుతం అత‌ని కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా సాగుతుంది. సుదీర్ఘ కాలం పాటు బుల్లితెరపై నెంబర్ వన్ కమెడియన్‌గా హవాను చూపించిన హైపర్ ఆది.. ఇప్పుడు సినిమాల‌లో కూడా క‌నిపించి సంద‌డి చేస్తున్నాడు. హీరోల ఫ్రెండ్స్ పాత్ర‌ల‌లోను హైప‌ర్ ఆది ప‌ర్‌ఫార్మెన్స్ అదిరి

  • By: sn    cinema    May 08, 2024 9:20 AM IST
Hyper Aadi|హైప‌ర్ ఆది నా క‌డుపు కొట్టాడు.. పెళ్లి చేసుకోవల్సిందే అంటున్న రోహిణి

Hyper Aadi| అతి త‌క్కువ టైమ్‌లోనే స్టార్ స్టేట‌స్ సంపాదించాడు హైపర్ ఆది. అదిరిపోయే టైమింగ్‌తో పాటు ఆకట్టుకునే పంచులు ప్రేక్ష‌కుల‌ని క‌డుపుబ్బ న‌వ్విస్తాయి. ప్ర‌స్తుతం అత‌ని కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా సాగుతుంది. సుదీర్ఘ కాలం పాటు బుల్లితెరపై నెంబర్ వన్ కమెడియన్‌గా హవాను చూపించిన హైపర్ ఆది.. ఇప్పుడు సినిమాల‌లో కూడా క‌నిపించి సంద‌డి చేస్తున్నాడు. హీరోల ఫ్రెండ్స్ పాత్ర‌ల‌లోను హైప‌ర్ ఆది ప‌ర్‌ఫార్మెన్స్ అదిరిపోతుంది. ‘ఆటగదరా శివ’ అనే మూవీలో లీడ్ రోల్ చేయడంతో పాటు ‘మేడ మీద అబ్బాయి’ అనే సినిమాకు డైలాగ్స్ కూడా ఇచ్చాడు హైప‌ర్ ఆది. ఇప్పుడు ఆది జ‌న‌సేన త‌ర‌పు ప్ర‌చారం చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ స‌మ‌యంలో రోహిణి.. హైప‌ర్ ఆది త‌న క‌డుపు కొట్టాడ‌ని పెళ్లి చేసుకోవ‌ల్సిందే అంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.

వివ‌రాల‌లోకి వెళితే బుల్లితెర న‌టి రోహిణి త‌న న‌ట‌న‌తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అద్భుత‌మైన ప‌ర్‌ఫార్మెన్స్ తో అద‌ర‌గొడుతూ ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచుతుంది. అయితే తాజాగా రోహిణి..హైపర్ ఆది, పొట్టి నరేష్‌తో క‌లిసి శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక స్కిట్ చేసింది. ఆ స్కిట్‌లో భాగంగా హైపర్ ఆది నా వ్యాపారం నాశనం చేసి కడుపు కొట్టాడు. నాకు దిక్కు లేదు. పెళ్లి చేసుకోవాల్సిందే అంటూ ర‌చ్చ చేసింది రోహిణి.స్కిట్‌లో భాగంగా బుగ్గలు, ఐస్ క్రీమ్ లు అమ్ముకునే అమ్మాయి పాత్ర పోషించింది రోహిణి. ఇక హైప‌ర్ ఆది త‌న పంచెస్‌తో రోహిణి వ్యాపారాన్ని దెబ్బ‌తీస్తాడు. అప్పుడు రోహిణి.. నా క‌డుపు కొట్టాడు, హైప‌ర్ ఆది న‌న్ను పెళ్లి చేసుకోవ‌ల్సిందే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

అయితే రోహిణి కామెంట్స్, హైప‌ర్ ఆది పంచెస్ ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని పంచుతున్నాయి. ఇక హైప‌ర్ ఆది విష‌యానికి వ‌స్తే తెలుగు బుల్లితెరపై చాలా కాలంగా మంచి మంచి ఆఫ‌ర్స్ అందుకుంటోన్న హైపర్ ఆది జబర్దస్త్ సహా ఎన్నో షోలు చేశాడు. అయితే, ఇప్పుడు మాత్రం అతడు బిజీ షెడ్యూల్ కారణంగా కొన్ని షోల‌కి బ్రేక్ వేశాడు. అలా తనకు లైఫ్ ఇచ్చిన జబర్ధస్త్‌కు అతడు దూరం అయ్యాడు. కానీ, ‘శ్రీదేవి డ్రామా కంపెనీలో మాత్రం ప్ర‌తి వారం క‌నిపిస్తూ మంచి వినోదాన్ని పంచుతున్నాడు.