Hyper Aadi | సినిమా ఇండస్ట్రీ అనేది సముద్రం వంటిది.. నిశ్చలంగా అక్కడే ఉంటుంది. అందులోకి నదుల రూపంలో వచ్చి చేరే వాళ్లు నటీనటులనుకుంటే.. ఆ నదులలో ఎప్పుడూ ఒకే నీరు ఉండదు. కొత్త నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా స్థిరంగా నటీనటులు ఉండటానికి ఇదేం సముద్రం కాదని తెలుసుకోవాలి. ఇందులో పిల్ల కాలువ వంటి వారు కమెడియన్స్. నదిలో కలిస్తేనే కనిపించకుండా పోయే పిల్ల కాలువలు.. మేమే సముద్రం అని ఊహించుకుంటే.. […]
Hyper Aadi |
సినిమా ఇండస్ట్రీ అనేది సముద్రం వంటిది.. నిశ్చలంగా అక్కడే ఉంటుంది. అందులోకి నదుల రూపంలో వచ్చి చేరే వాళ్లు నటీనటులనుకుంటే.. ఆ నదులలో ఎప్పుడూ ఒకే నీరు ఉండదు. కొత్త నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా స్థిరంగా నటీనటులు ఉండటానికి ఇదేం సముద్రం కాదని తెలుసుకోవాలి. ఇందులో పిల్ల కాలువ వంటి వారు కమెడియన్స్.
నదిలో కలిస్తేనే కనిపించకుండా పోయే పిల్ల కాలువలు.. మేమే సముద్రం అని ఊహించుకుంటే.. మునిగిపోతారనే విషయం తెలుసుకోవడం లేదు. అలాంటి పిల్ల కాలువే హైపర్ ఆది. రీసెంట్గా ‘భోళా శంకర్’ ప్రీ రిలీజ్ వేడుకలో హైపర్ ఆది బిల్డప్ చూసిన వారంతా అనుకుంటున్న విషయమిదే.
ఇండస్ట్రీలో నేనేదో స్థిరం అనే ఫీలింగ్‌లో ఉన్నట్లుగా.. హైపర్ ఆది బిహేవ్ చేస్తున్నాడు.. తనొక పాసింగ్ క్లౌడ్ అనే విషయం తెలుసుకోవడం లేదంటూ కొందరు కామెంట్స్ చేస్తుండటం విశేషం. విషయంలోకి వస్తే.. హైపర్ ఆది ఓ ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చాననే విషయం వదిలేసి.. ఏవేవో చెప్పుకొచ్చాడు. మరీ ముఖ్యంగా ఆయనకి మెగా ఫ్యామిలీపై ప్రేమ ఉండొచ్చు.. అభిమానం ఉండొచ్చు.. ఇంకా ఏదైనా ఉండొచ్చు.
కానీ దానిని ప్రదర్శించే విధానానికి సమయం, సందర్భం ఉంటుందని తెలుసుకోకుండా.. మైక్ దొరికింది కదా.. అని లెక్కలు తేల్చేస్తా.. కుర్చీ మడతెట్టి కొడతా.. ఇలా మాట్లాడితే.. ఎవడు పడతాడు. అంత మగాడా.. అంటే అటు వైపు వాళ్లు.. ఈయన కుర్చీ మడతెట్టి కొడుతుంటే.. చేతికి గాజులు తొడుక్కున్న వాళ్లలా కొట్టించుకుంటారని అనుకుంటున్నాడా? ఎవరూ.. ఎదురు తిరిగి మాట్లాడలేరనా?.. ఇష్టం వచ్చినట్లుగా ఆది రెచ్చిపోతుంది.
అయినా చిరంజీవి ఫ్యామిలీ గురించి నువ్వు చెప్పేదేంటి? 40 ఇయర్స్ ఇండస్ట్రీ. ఆయనకు తెలియదా.. కుటుంబంలో ఉన్న లోటు పాట్లు. ఆయనే కామ్‌గా ఉంటే.. నీకెందుకు.. అంత చించుకుంటున్నావ్? అని సోషల్ మీడియా వేదికగా హైపర్ ఆదిని ఆడేసుకుంటున్నారు కొందరు నెటిజన్లు. ముఖ్యంగా మెగాభిమానులు కూడా హైపర్ ఆది విషయంలో సీరియస్‌గా ఉండటం గమనార్హం.
ఎందుకంటే.. సుమన్, ఉదయ్ కిరణ్ వంటి సెన్సిటివ్ ఇష్యూస్‌ని కూడా యూట్యూబ్ ఛానల్స్‌ని టార్గెట్ చేస్తూ.. హైపర్ ఆది కెలికాడు. ఇది అరిగిపోయిన రికార్డ్. ప్రస్తుతం ఈ సెన్సిటివ్ విషయాలపై అంతా కామ్‌గానే ఉన్నారు. ఎక్కడో ఒకరిద్దరు యూట్యూబ్ వాళ్లు కెలికారని.. హైపర్ ఆది ఇప్పుడు పబ్లిక్‌లో పెట్టేశాడు. దీనిని ఆసరాగా తీసుకుని యూట్యూబ్ ఛానల్స్ తగులుకుంటే.. తట్టుకోవడం చిరంజీవి వల్ల కూడా కాదు.
అయినా.. నువ్వు వివరణ వివరణ ఇచ్చెదేంటి? మెగాభిమానులందరికీ మెగాస్టార్ గురించి తెలుసు. ఆయన ఏం చేస్తాడో? ఎలా ఉంటాడో తెలుసు? మెగాస్టార్ విషయంలో కొందరు శత్రువులు అనుకునే వారు కూడా.. చాలా గౌరవంగా వ్యవహరిస్తుంటారు. సెలబ్రిటీ అందునా.. టాప్ స్థానంలో ఉన్న సెలబ్రిటీ, కొంతకాలం రాజకీయాలలో ఉన్న సెలబ్రిటీపై విమర్శలు రావడం సహజమే. అలాంటి విమర్శలకు చిరంజీవి సమాధానం.. మౌనమే.
కానీ ఇలాంటి ఎగిరెగిరి పడే ఆకుల వల్ల.. ఆయన కూడా ఇబ్బందులను ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సినిమా ఈవెంట్‌కి వచ్చాం.. ఆ సినిమా గురించి తెలిస్తే నాలుగు ముక్కలు మాట్లాడేసి వెళ్లిపోవాలి. అంతేకానీ.. అన్నీ నాకే తెలుసు.. నేనే పెద్ద తోపు అని బిల్డప్‌లు పోతే.. బీడీని కాల్చి పడేసినట్లు కాల్చి అవతల పడేస్తారు. నీ స్థానం, స్థాయి తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది ఆది.. ఇప్పటికే చాలా ఎక్కువ చేస్తున్నావ్.. అనేలా కొందరు నెటిజన్లు.. డైరెక్ట్‌గా ఆదికి వార్నింగ్స్ ఇస్తుండటం చూస్తుంటే.. అతని స్పీచ్ ఎంత హర్ట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు.