‘జటాధర’ సినిమా టీజర్ వచ్చేసింది..!

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా నటించిన ‘జటాధర’ టీజర్ వచ్చేసింది! విజువల్ వండర్‌గా మైథాలజికల్ థ్రిల్లర్‌గా మెస్మరైజ్ చేస్తోంది!

‘జటాధర’ సినిమా టీజర్ వచ్చేసింది..!

టాలీవుడ్‌ న‌టుడు సుధీర్‌ బాబు(Sudheer Babu) ప్ర‌ధాన పాత్ర‌లో నటిస్తున్న ‘జటాధర’(Jatadhara) సినిమా టీజర్ ను మేకర్స్ శుక్రవారం విడులు చేశారు. పాన్ ఇండియా సినిమాగా మైథాలాజిక‌ల్, న్యాచుర‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెరకెక్కుతున్న ‘జటాధర’ సినిమా టీజర్ చూస్తే సినిమా విజువల్ వండర్ గా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా(Sonakshi Sinha) టాలీవుడ్‌లోకి అడుగుపెడుతుంది. టీజర్ లో సోనాక్షి సిన్హా మాయావి మహిళ పాత్రలో నిధి రక్షకురాలిగా పవర్ ఫుల్ గా కనిపించగా..సుధీర్ బాబు కథానాయకుడి పాత్రలో మెరిశారు. దురాశకు, త్యాగానికి మధ్య జరిగే పోరాటాన్ని చూసేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా చిత్రబృందం పేర్కొంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హీరో ప్ర‌భాస్ స్వ‌యంగా త‌న ఇన్ స్టాలో ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేయ‌డంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఈ సినిమాపై ఆసక్తి చూపుతున్నారు.

వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ సంయుక్తంగా దర్శకత్వంతో రూపొందుతున్న ‘జటాధర’ సినిమాకు వెంకట్ కళ్యాణ్ కథను అందించారు. ఈ చిత్రంలో రైన్ అంజలి, శిల్పా శిరోడ్కర్, ర‌వి ప్ర‌కాష్‌, ఇంద్ర కృష్ణ‌, న‌వీన్ నేని, శుభ‌లేఖ సుధాక‌ర్‌, రాజీవ్ క‌న‌కాల‌, ఝాన్సీలు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా.. జీ స్టూడియో సమర్పణలో ఉమేశ్‌ కె.ఆర్‌.భన్సాల్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.