Kantara Chapter 1 surpasses Bahubali | బాహుబలిని అధిగమించిన కాంతార చాప్టర్ 1
రిషబ్ శెట్టి నటించిన 'కాంతార చాప్టర్ 1' ప్రపంచవ్యాప్తంగా 12 రోజుల్లో ₹675 కోట్లు వసూలు చేసి, 'బాహుబలి: ది బిగినింగ్' (₹650 కోట్లు) రికార్డును అధిగమించింది.

విధాత : రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతారా చాప్టర్ 1 వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్లతో కొత్త రికార్డుల నమోదుతో దూసుకపోతుంది. 12రోజులలో వరల్డ్ వైడ్ రూ.675కోట్లు వసూలు చేసి..బాహుబలి ది బిగినింగ్ రూ.650కోట్ల రికార్డును అధిగమించింది. అలాగే సల్మాన్ ఖాన్ సుల్తాన్ మూవీ రూ.628కోట్ల కలెక్షన్లను కూడా దాటేసింది. ఇప్పటిదాక కాంతార చాప్టర్ 1 సాధించిన కలెక్షన్లతో దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 20చిత్రాల జాబితాలో 17వ స్థానానికి ఎగబాకింది.
అటు ఈ ఏడాది 2025లో దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలో జాబితాలో కాంతార చాప్టర్ 1 రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఛావ రూ.808కోట్ల కలెషన్స్ రికార్డుతో కొనసాగుతుంది. అయితే కాంతార చాప్టర్ 1కు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ కొనసాగుతుండటంతో మరిన్ని రికార్డులను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ రూ.700కోట్ల గ్రాస్ మార్క్ దిశగా దూసుకెలుతుంది. సినిమా రిలీజై దాదాపు రెండు వారాలు దగ్గరికొస్తున్న ఇంకా ఎక్కడ కూడా ఈ మూవీ జోరు తగ్గడం లేదు. తెలుగు వెర్షన్ ఒక్కటే రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. గతంలో రజనీకాంత్, యష్ వంటి ఇద్దరు పరభాషా హీరోలు మాత్రమే తెలుగు డబ్బింగ్ వెర్షన్ తో వంద కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టారు. ఇప్పుడు ఈ ఫీట్ సాధించిన మూడో తెలుగుయేతర హీరోగా రిషబ్ శెట్టి నిలిచారు.