Kantara Chapter 1 : రూ.500కోట్ల క్లబ్ లో చేరిన ‘కాంతార చాప్టర్‌ 1’

రిషబ్‌ శెట్టి దర్శకత్వం వహించిన 'కాంతార చాప్టర్ 1' చిత్రం 9 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.509 కోట్ల వసూళ్లు సాధించి, రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది.

Kantara Chapter 1 : రూ.500కోట్ల క్లబ్ లో చేరిన ‘కాంతార చాప్టర్‌ 1’

విధాత : రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార చాప్టర్‌ 1’ చిత్రం బాక్సాఫీస్ వసూళ్లలో దూసుకపోతుంది. కాంతార విజయం నేపథ్యంలో భారీ అంచనాల మధ్య దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ‘కాంతార చాప్టర్‌ 1’ కలెక్లన్లలో రికార్డులు కొల్లగొడుతుంది. విడుదలైన 9 రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాక సాధించిన వసూళ్లను తెలుపుతూ నిర్మాణసంస్థ తాజాగా పోస్టర్‌ విడుదల చేసింది. వరల్డ్‌ వైడ్‌గా రూ.509 కోట్లు సాధించినట్లు తెలిపింది .

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా నిలిచింది. ‘ఛావా’ రూ.600 కోట్లతో ఈ ఏడాదిలో విడుదలైన అత్యధిక వసూళ్ల సినిమాగా ప్రస్తుతం టాప్‌ వన్ లో ఉంది. థియేటర్‌లలో హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో దూసుకపోతున్న‘కాంతార చాప్టర్‌ 1’ మూవీత్వరలోనే ‘ఛావా’ రికార్డును బ్రేక్ చేసి.. మొదటి స్థానంలోకి వెళ్లే అవకాశం ఉంది. కాంతార 1 విజయంపై దర్శకుడు రిషబ్ శెట్టి స్పందిస్తూ ప్రేక్షకుల ప్రశంసలు..వస్తున్న కలెక్షన్లు చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. ఈ విజయం నా బాధ్యతను రెట్టింపు చేసింది అని తెలిపారు.