Maria Corina Machado wins 2025 Nobel Peace Prize| మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి..ట్రంప్ కు నిరాశ
ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు కృషి చేసినందుకు వెనిజులా పార్లమెంటు సభ్యురాలు మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి-2025 దక్కింది. ఈ అవార్డుపై ఆశలు పెట్టుకున్న డోనాల్డ్ ట్రంప్‌కు నిరాశ ఎదురైంది.
న్యూఢిల్లీ : నోబెల్ -2025 శాంతి బహుమతిని వెనిజులా పార్లమెంటు సభ్యురాలు మరియా కొరినా మచోడాకు దక్కింది. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం మరియా కొరినా మచాడో చేసిన కృషికి గుర్తిస్తూ ఆమెకు నోబెల్ శాంతి బహుమతి ప్రకటించినట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఈ పురస్కారానికి మొత్తం 338 మంది నామినేట్ అవ్వగా.. మరియా వైపు అకాడమీ సభ్యుల మొగ్గు చూపారు. కాగా నోబెల్ శాంతి బహుమతిపై భారీ ఆశలు పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు నిరాశ ఎదురయ్యింది.
తాను ఇప్పటికే ప్రపంచంలో 7యుద్దాలు ఆపానని..తాజాగా హమాస్ – ఇజ్రాయిల్ యుద్దంతో 8వ యుద్దం కూడా ఆపి శాంతి స్థాపనకు కృషి చేశానని..తనకు నోబెల్ శాంతి బహుమతి రావాలని ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే నోబెల్ అవార్డు నిర్వాహకులు మాత్రం వెనిజులా పార్లమెంటు సభ్యురాలు మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు. దీంతో ట్రంప్ మరో ఏడాది పాటు నోబెల్ శాంతి బహుమతి కోసం ఎదురుచూపులు పడక తప్పని పరిస్థితి నెలకొంది.
గతేడాది నోబెల్ శాంతి పురస్కారం హిరోషిమా, నాగసాకిల్లో అణుదాడి నుంచి బయటపడిన బాధితుల పక్షాన పోరాడుతోన్న జపాన్‌కు చెందిన నిహాన్ హిడాంక్యో సంస్థకు దక్కిన విషయం తెలిసిందే.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram