BJP Releases First List Of Candidates | బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025: 71 మందితో బీజేపీ తొలి జాబితా విడుదల
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు 71 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా విడుదలైంది. ఇద్దరు డిప్యూటీ సీఎంలకు ఫస్ట్ లిస్ట్‌లో చోటు దక్కింది.

బీహార్ అసెంబ్లీలో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ మంగళవారం నాడు విడుదల చేసింది. తొలి జాబితాలో 71 మందికి చోటు లభించింది. బీహార్ రాష్ట్రంలో డిప్యూటీ ముఖ్యమంత్రులుగా ఉన్న ఇద్దరికి బీజేపీ ఫస్ట్ లిస్ట్ లో చోటు దక్కింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు కుదిరిన మరునాడే బీజేపీ తన తొలి జాబితాను విడుదల చేసింది. 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో బీజేపీ, జేడీ(యూ) 101 అసెంబ్లీ స్థానాల చొప్పున పోటీ చేస్తున్నాయి. మిగిలిన 41 స్థానాలను ఎన్డీఏలోని ఇతర పార్టీలకు కేటాయించాయి. తొలి జాబితాలో బీజేపీ 71 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఆ పార్టీ ఇంకా 30 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. బీహార్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రులుగా ఉన్న సామ్రాట్ చౌదరి తారాపూర్ అసెంబ్లీ నుంచి, విజయ్ కుమార్ సిన్హా లక్షిసారై అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు.
దానాపూర్ నుంచి పార్టీ సీనియర్ నేత రామ్ కృపాల్ యాదవ్, గయా నుంచి ప్రేమ్ కుమార్, కతిహార్ నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి తార్కిషోర్ ప్రసాద్, సహర్సా నుంచి అలోక్ రంజన్ ఝా, శివన్ నుంచి మంగళ్ పాండే హిసువా నుంచి అనిల్ కుమార్ బరిలోకి దిగుతున్నారు. సీనియర్ నాయకుడు నంద్ కిషోర్ యాదవ్ కు టికెట్ దక్కలేదు. ఆయన స్థానంలో రత్నేష్ కుష్వాహా పాట్నా సాహిబ్ నుండి బీజేపీ బరిలోకి దింపింది.