Mirai Movie: విజువల్ వండర్..తేజ సజ్జా మిరాయ్ మూవీ టీజర్!

Mirai Movie: హనుమాన్ సినిమాతో సూపర్ హీరోగా అలరించిన యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా వస్తోన్న మిరాయ్ సినిమా నుంచి మేకర్స్ బుధవారం టీజర్ విడుదల చేశారు. తేజా సజ్జా, మంచు మనోజ్ లు కనిపించిన పలు సీన్లు విజువల్ వండర్స్ అనిపించాయి. కలియుగంలో పుట్టిన ఏ శక్తి దీన్ని ఆపలేదంటూ సాగిన టీజర్స్ లోని సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించడంతో పాటు సినిమాపై ఆసక్తి పెంచేలా ఉన్నాయి. టీజర్స్ లోనే ఈ రేంజ్ హాలివుడ్ విజువల్స్ అన్నట్లుగా ఉంటే..సినిమా ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో ఉహించుకోవచ్చంటున్నారు అభిమానులు. తేజకు మరో భారీ విజయం ఖాయమని అంటున్నారు.
తేజ సజ్జా హీరోగా ఈగల్ సినిమా దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న మిరాయ్ చిత్రం యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందుతుంది. తేజ సజ్జా సూపర్ యోధుడి పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుండగా, మంచు మనోజ్ ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. రీతికా నాయక్ హీరోయిన్. సినిమాను సెప్టెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది భాషల్లో విడుదల చేయబోతున్నారు.