Mahesh Goud: ఫూలే.. మూవీని అందరూ చూడాలి

  • By: sr    news    Jun 28, 2025 10:06 PM IST
Mahesh Goud: ఫూలే.. మూవీని అందరూ చూడాలి

విధాత, హైదరాబాద్ : మహిళలు చదువుకుంటే నేరంగా పరిగణించే రోజుల్లో అగ్రవర్ణ సమాజాన్ని ఎదురించి సావిత్రిబాయిని చదివించి యావత్ మహిళా లోకానికి నూతన ఒరవడి సృష్టించిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు ఫూలే అని టీపీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. శనివారం పంజాగుట్టలోని పీవీఆర్ సినిమాస్ లో “ఫూలే” చిత్రాన్ని ఆయన తిలకించారు.

సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లోనే జ్యోతి రావు పులే తన భార్యను చదివించాడన్నారు. బహుజనులు చదువుకొని ఉన్నత స్థాయికి వచ్చామంటే జ్యోతి రావు పులే కృషి వల్లే అని చెప్పుకొచ్చారు. ఫులే చిత్ర నిర్మాతలు, డైరక్టర్, చిత్రంలోని నటీనటులకు అభినందనలు తెలిపారు. రెండు వందల ఏళ్ళ క్రితం జరిగిన కథను కళ్ళకు కట్టినట్లుగా ఫూలే చిత్రాన్ని తెరకెక్కించారన్నారు.

రాహుల్ గాంధీ తో పాటు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఫూలే సినిమాను చూస్తున్నారని తెలిపారు. మన రాష్ట్రంలో ఈ చిత్రానికి టాక్స్ మినహాయింపు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్టు చెప్పారు. మన భవిష్యత్తుకు ఆనాడు ఫూలే ఎంత కృషి చేశారో ఈ చిత్రం ద్వారా అర్థమవుతున్నదన్న టీపీపీసీ చీఫ్.. చక్కటీ సందేశాన్ని ఇచ్చే ఫూలే చిత్రాన్ని రాష్ట్ర ప్రజలంతా చూడాలని కోరారు.