Jr Ntr| నందమూరి ఫ్యామిలీ హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్‌కి ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆయన దేవర అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సి
Jr Ntr| నందమూరి ఫ్యామిలీ హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్‌కి ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆయన దేవర అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో పాటు వార్2 అనే సినిమా కూడా చేస్తున్నాడు. పూర్తి స్థాయి బాలీవుడ్ సినిమా కూడా చేయనున్నట్టు తెలుస్తుంది.అయితే ఎన్టీఆర్‌కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. చంద్రబాబు, బాలయ్య చేసిన ఆ పని వల్లనే ఎన్టీఆర్ వారికి దూరంగా ఉంటున్నాడని, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొనకపోవడానికి కారణం కూడా అదే అంటున్నారు.
ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి మెలిసి ఉండేవాడు. ముఖ్యంగా బాలయ్య బాబు తో ఎంతో కలివిడిగా ఉండేవాడు. ఫ్యామిలీ ఫంక్షన్స్, పార్టీకి సంబంధించిన ఈవెంట్స్ ఏవైన కూడా ఎన్టీఆర్ హాజరయ్యేవాడు. 2009వ సంవత్సరంలో టిడిపి పార్టీ తరపున క్యాంపెనింగ్ చేసి టిడిపి పార్టీ కి మంచి సీట్లు రావడానికి కూడాకారణం అయ్యాడు. అయితే కొంత కాలంగా ఎన్టీఆర్ బాలయ్య కి చంద్రబాబు నాయుడుకు చాలా దూరంగా ఉంటున్నాడు.అందుకు కారణం ఎవరికి అర్ధం కావడం లేదు. హరికృష్ణ చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు దానిని కూడా రాజకీయంగా వాడుకున్నాడనే ఉద్దేశంతో ఎన్టీఆర్ వారికి సపరేట్గా ఉంటున్నట్టు ప్రచారం జరుగుతుంది.
మరికొందరు అసలు కారణం వేరేది ఉందని అని చెప్పుకొస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమంకి ఎన్టీఆర్‌కి ఆహ్వానం అందుకుతుందని అందరు అనుకున్నారు.కాని అది జరగలేదు. అందరికి ఆహ్వానాలు అందిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లకి అందకపోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆ సమయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చాలా హర్ట్ అయ్యారు. ఏదిఏమైన కూడా చంద్రబాబు, బాలయ్యలతో ఎన్టీఆర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం గత కొద్ది రోజులుగా చర్చనీయాంశంగా మారింది.