Kannada Actor Darshan | కన్నడ నటుడు దర్శన్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్
సుప్రీంకోర్టు కన్నడ నటుడు దర్శన్ బెయిల్ రద్దు 🚨 రేణుకాస్వామి హత్యకేసులో మళ్లీ కస్టడీకి ఆదేశాలు – షాకింగ్ డీటైల్స్ బయటకు!

Kannada Actor Darshan | న్యూఢిల్లీ : అభిమాని రేణుకస్వామి హత్య కేసులో అరెస్టయిన కన్నడ నటుడు దర్శన్ కు సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. కర్ణాటక హైకోర్టు దర్శన్ కు ఇచ్చిన బెయిల్ ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. ఈ మేరకు జస్టిస్ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దర్శన్‌కు బెయిల్ మంజూరు చేయడంపై కర్ణాటక హైకోర్టుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో దర్శన్, హీరోయిన్ పవిత్ర గౌడతో పాటు మరికొందరికి అక్టోబర్‌లో కర్ణాటక హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వగా.. డిసెంబర్ 13న రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. కర్ణాటక హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ సందర్భంగా హైకోర్టు చేసిన తప్పును తాము మళ్లీ చేయబోమని ఆగ్రహం వ్యక్తం చేసింది.
విచారణ సందర్భంగా కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని ఆక్షేపిస్తూ.. అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. దర్శన్‌కు బెయిల్ ఇచ్చేందుకు ఎలాంటి చట్టపరమైన కారణాలు లేవని పేర్కొంది. బెయిల్ మంజూరు విచారణ, సాక్షులపై ప్రభావం చూపుతుందని జస్టిస్ మహాదేవన్ పేర్కొన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కారంటూ.. కస్టడీలో దర్శన్‌కు ఎలాంటి ప్రత్యేక ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదని జైలు అధికారులకు సూచించారు. నిందితులకు జైళ్లలో ఫైవ్‌స్టార్ ట్రీట్‌మెంట్ ఇస్తున్నట్లు తమ దృష్టికి వస్తే.. జైలు సూపరింటెండెంట్‌పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దర్శన్‌ను త్వరగా అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు.
కర్ణాటక లో దర్శన్ అభిమాని రేణుకాస్వామిహత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అతడిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో దర్శన్, ఆయన స్నేహితురాలు పవిత్రగౌడ సహా 15 మందిని అరెస్టు చేశారు. రేణుకాస్వామిని అత్యంత పాశవికంగా కొట్టినట్లు విచారణలో తేలింది. అతడికి కరెంట్ షాక్ కూడా పెట్టినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.
ఇవి కూడా చదవండి…
లోబిపి ఉంటే.. ఇలా చేస్తే.. సెట్ అవుతుంది! హైబీపీకీ ఉపశమనం ఉంది!
సానియాను పెళ్లాడనున్న అర్జున్ టెండూల్కర్..!