TTD | తిరుమలలో తెలంగాణ లేఖలకు విలువ లేదు

తిరుమలలో శ్రీవారి దర్శనానికి తెలంగాణ మంత్రులు, అత్యున్నత స్థాయి అధికారులు ఇచ్చే సిఫారసు లేఖలను పరిగణించడం లేదని టిటిడి ఈఓ శ్యామలరావు స్పష్టం చేసారు.

TTD | తిరుమలలో తెలంగాణ లేఖలకు విలువ లేదు

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)​లో కూటమి ప్రభుత్వం చంద్రబాబు, పవన్​కళ్యాణ్(DCM Pavan Kalyan)​ల అధ్వర్యంలో కొలువుదీరింది. ఇక ప్రక్షాళన కార్యక్రమాలు మొదలుపెట్టిన ముఖ్యమంత్రి(CM Chandrababu), ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanams – TTD)తోనే మొదలుపెట్టారు. అప్పటివరకు ఈఓ(EO)గా ఉన్న ధర్మారెడ్డిని తప్పించి కేంద్ర సర్వీసుల్లో ఉన్న శ్యామలరావు(New EO Shayamala Rao)ను రప్పించి ఈఓగా నియమించారు. ఈమధ్యే జేఈఓగా వెంకయ్య చౌదరి(JEO – Venkaiah Chowdary)ని కూడా టిటిడికి పంపించారు. ప్రభుత్వం మారిన వెంటనే టిటిడి పాలకమండలి(TTD Board) రద్దయింది. ఇంకా కొత్త బోర్డును ప్రతిపాదించలేదు. సంప్రదాయం ప్రకారం టిటిడి బోర్డులో తెలంగాణ నుంచి కూడా ముగ్గురినో, నలుగురినో నియమించే అవకాశం ఉంది. అదింకా జరగలేదు.

నిన్న జరిగిన డయల్​ యువర్​ ఈఓ(Dail your EO) కార్యక్రమంలో కొంతమంది అడిగిన ప్రశ్నలకు ఈఓ శ్యామలరావు సమాధానాలు ఇచ్చారు. ఇందులో తెలంగాణ(Telangana) నుండి ఒక భక్తుడు అడిగిన ప్రశ్నకు కూడా ఈఓ జవాబిచ్చారు.తిరుమలలో స్వామివారి దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిధులు(Telangana Ministers) ఇచ్చిన సిఫారసు లేఖల(Recommendation Letters)ను టిటిడి అధికారులు పరిగణించడంలేదని(Not considering) అతను అడగగా, తాము కేవలం ఆంధ్రప్రదేశ్​ నుండి వచ్చిన లేఖలను మాత్రమే(Only AP Letters) పరిగణనలోకి తీసుకుంటున్నామని ఈఓ స్పష్టం చేసారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన లేఖల గురించి ఇంకా తాము ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని, ప్రభుత్వం నుండి కూడా ఎటువంటి మార్గదర్శకాలు(Guidelines) రాలేదని ఆయన తెలిపారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రుల మధ్య మంచి సయోధ్య ఉండటంతో, ఈ విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి(Telangana CM) రేవంత్​ రెడ్డి, ఏపీ సిఎం చంద్రబాబుతో మాట్లాడి తగుచర్యలు చేపడితే బాగుంటుదని భక్తుల అభిప్రాయం. అలాగే టిటిడి బోర్డులో కూడా తెలంగాణ సభ్యుల(Telangana represenation to be increased in TTD) ప్రాతినిధ్యాన్ని పెంచాలనే డిమాండు కూడా ఉంది. కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి ఇదివరకే తిరుమలలో తెలంగాణ భవన్​(Telangana Bhavan in TTD) నిర్మించడానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.