Gulshan Devaiah in Kantara | కాంతార చాప్టర్ – 1 నుంచి ‘కులశేఖర’గా గుల్షన్ దేవయ్య

కాంతార చాప్టర్-1లో విలన్ కులశేఖరగా గుల్షన్ దేవయ్య లుక్ రిలీజ్. రిషబ్ శెట్టి ప్రీక్వెల్ అక్టోబర్ 2న మల్టీ లాంగ్వేజెస్‌లో విడుదల

Gulshan Devaiah in Kantara | కాంతార చాప్టర్ – 1 నుంచి ‘కులశేఖర’గా గుల్షన్ దేవయ్య

Gulshan Devaiah in Kantara | విధాత: కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రాబోతున్న కాంతార చాప్టర్ – 1 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చారు. ఇటీవల కథానాయిక రుక్మిణి వసంత్ పాత్ర కన్మణి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్ మంగళవారం మూవీలోని విలన్ పాత్ర ధారి గుల్షన్ దేవయ్య కులశేఖర పాత్ర పోస్టర్ ను విడుదల చేశారు. పిరియాడిక్ యక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో కుల శేఖర రాజు పాత్రలో గుల్షన్ దేవయ్య నటిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆయన లుక్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేదిగా ఉంది.

బ్లాక్ బస్టర్ మూవీ కాంతార సినిమాకు ప్రీక్వెల్ గా రాబోతున్న కాంతార చాప్టర్ – 1 ఆక్టోబర్ 2న కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో విడుదల కానుంది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అజ్నిశ్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు.