Upasana | కవలలకి జన్మనిచ్చిన ఉపాసన.. అధికారికంగా ప్రకటించిన చిరంజీవి
Upasana | మెగా కుటుంబంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు మరోమారు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండంటి కవలలకు జన్మనిచ్చినట్లు అధికారిక సమాచారం వెలువడింది. ఈ శుభవార్త బయటకు రావడంతో మెగా ఇంట సంబరాలు మొదలయ్యాయి.
Upasana | మెగా కుటుంబంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు మరోమారు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండంటి కవలలకు జన్మనిచ్చినట్లు అధికారిక సమాచారం వెలువడింది. ఈ శుభవార్త బయటకు రావడంతో మెగా ఇంట సంబరాలు మొదలయ్యాయి. కవలలు పుట్టిన విషయాన్ని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించడం విశేషం. తల్లి, చిన్నారులు ఆరోగ్యంగా ఉన్నారని ఆయన పేర్కొనగా, సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ తదితర వేదికలపై #MegaTwins, #RamCharan ట్రెండింగ్ అవుతున్నాయి.
వార్త తెలిసిన వెంటనే రామ్ చరణ్ కుటుంబ సభ్యులు, చిరంజీవి సహా మెగా ఫ్యామిలీ అంతా అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. కుటుంబ సభ్యుల ఆనందం చూసి అభిమానులు కూడా ఉత్సాహంతో ఆసుపత్రి ప్రాంగణానికి భారీగా తరలివెళ్లారు. దవాఖాన వద్దే మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటూ స్వీట్లు పంచిపెడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఫ్యాన్స్ బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఇప్పటికే రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు కుమార్తె క్లింకార ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు కవలలు జన్మించడంతో మెగా కుటుంబంలో ఆనందం రెట్టింపైంది. ముఖ్యంగా మెగా వారసుడు పుట్టాడనే వార్త అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపుతోంది.
గతంలో చిరంజీవి సరదాగా చెప్పిన “ఇంట్లో అందరూ ఆడపిల్లలే ఉన్నారు” అన్న వ్యాఖ్యలను అభిమానులు గుర్తు చేసుకుంటూ ఇప్పుడు ఆ కోరిక నెరవేరిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 2012లో వివాహ బంధంతో ఒక్కటైన రామ్ చరణ్ – ఉపాసనలు ఆదర్శ దంపతులుగా పేరు తెచ్చుకున్నారు. వ్యాపార రంగం, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇప్పుడు కవల పిల్లల రాకతో వారి కుటుంబ జీవితం మరింత సంతోషంగా మారింది. మెగా ఇంట ఆనందం అంబరాన్నంటుతుండగా, అభిమానుల శుభాకాంక్షలతో సోషల్ మీడియా మార్మోగుతోంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram