Hema| హేమ పెద్ద ఫేక్.. ఆమె అన్నీ ఫేక్ పనులే చేస్తుందంటూ కరాటే కళ్యాణి సంచలన ఆరోపణలు
Hema| బెంగళూరు రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాలతో పాటు టాలీవుడ్‌ని కుదిపేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు రేవ్ పార్టీలో పాల్గొన్నారంటూ ముందు ప్రచారం సాగింది. పార్టీలో హీరో శ్రీకాంత్, నటి హేమ, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఉన్నట్టు ప్రచారాలు సాగగా, వాటిపై ఈ ముగ్గురు క్లారిటీ ఇ

Hema| బెంగళూరు రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాలతో పాటు టాలీవుడ్‌ని కుదిపేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు రేవ్ పార్టీలో పాల్గొన్నారంటూ ముందు ప్రచారం సాగింది. పార్టీలో హీరో శ్రీకాంత్, నటి హేమ, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఉన్నట్టు ప్రచారాలు సాగగా, వాటిపై ఈ ముగ్గురు క్లారిటీ ఇచ్చారు. తమకు ఆ రేవ్ పార్టీతో సంబంధం లేదని అన్నారు. అయితే హేమ గురించి వార్తలు బయటకి రాగా ఆమె ఓ వీడియో రిలీజ్ చేసింది. తను హైదరాబాద్లోని ఒక రిసార్ట్ లో చిల్ అవుతున్నానని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత మళ్లీ కొత్తగా ఇంకొక వీడియోను రిలీజ్ చేశారు. తను ఇంట్లోనే ఉండి హ్యాపీగా వంట చేసుకుంటున్నట్టు బిర్యానీ కూడా ప్రిపేర్ చేస్తున్నట్టు హేమ తన ఇన్‌స్టా ద్వారా తెలియజేసింది.
హేమ ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారని ఏకంగా బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ దయానంద్ క్లారిటీ ఇచ్చినప్పటికీ ఆమె ఇలా వీడియో చేసి పెట్టడం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మీడియాని, జనాలను కన్‌ఫ్యూజ్ చేస్తున్న హేమపై నటి, బిగ్ బాస్ ఫేం కరాటే కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెకి జనాలలో హైలైట్ కావాలనే పిచ్చి ఉంది. అలా చేసి ఇప్పుడు ఇరుక్కుపోయింది. అందరిపై ఆరోపణలు చేసే ఆమెకి ఇప్పుడు తన ఉసురే తగిలిందని కళ్యాణి చెప్పింది. గతంలో తాను పేకాట ఆడుతున్నట్టు ఎన్నో ఆరోపణలు చేసి నన్న పబ్లిక్‌లో నిలబెట్టింది. చాలా మందిపై నోటి దూలతో ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేసింది.
నటిగా ఆమెపై రెస్పెక్ట్ ఉందని, ఎంతో కష్టపడి ఈ స్థాయకి వచ్చింది. కాకపోతే ఆమె పెద్ద ఫేక్. మొదట్నుంచి అన్నీ ఫేక్ పనులే చేస్తుంటుందని, ఫేక్ వీడియో రిలీజ్ చేసి అందరిని తప్పుదోవ పట్టించడమే ఆమె పని అంటూ కరాటే కళ్యాణి మండి పడింది. చికెన్ వీడియోతో మరింత మిస్ లీడ్ చేసే ప్రయత్నం చేసింది. పిలిస్తే నేను వచ్చాను అని సిన్సియర్‌గా చెబితే బాగుండేది. కాని హడావిడి చేసి ఇరుక్కుంది. హైదరాబాద్‌లో రేవ్ పార్టీలు జరగడం లేదు కాబట్టి బెంగళూరుకి వెళ్లింది. డ్రగ్స్ కూడా దొరికాయి కాబట్టి పెద్ద కేసులోనే ఇరుక్కుంది. ఆమె ఇవి చాలా సిల్లీగా తీసుకుంటుంది. నోటి దూల తగ్గించుకుంటే చాలా మంచిది అంటూ కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేసింది .. రేవ్ పార్టీలకు వెళ్లేవారికి కర్రపట్టుకుని రేవ్ పెట్టాలి అంటూ ఫైర్ అయ్యింది. మా అసోసియేషన్‌లో ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయరని, హేమకి సస్పెన్షన్ పడే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. అయితే చివరలో ఆమె కేసు నుండి క్లీన్‌గా రావాలని కోరుకుంటున్నట్టు తెలియజేసింది.