Keerthy Suresh | లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన ‘మహానటి’.. ప్రభాస్‌ పాన్‌ ఇండియా చిత్రంలో కీర్తి..!

  • By: Tech    cinema    Apr 03, 2024 11:20 AM IST
Keerthy Suresh | లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన ‘మహానటి’.. ప్రభాస్‌ పాన్‌ ఇండియా చిత్రంలో కీర్తి..!

Keerthy Suresh | యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. సలార్‌తో పాటు కల్కి చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ మూవీల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ తర్వాత అదే సమయంలో ‘స్పిరిట్‌’మూవీలో నటించనున్నాడు. ఈ చిత్రానికి సందీప్‌ వంగ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల సందీప్‌ వంగ దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్‌’ మూవీ బాస్లబస్టర్‌ విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటి వరకు ఉన్ని రికార్డులన్నింటిని తిరగరాసింది. ప్రస్తుతం ప్రభాస్‌తో సందీప్‌ ‘స్పిరిట్‌’ చిత్రం చేసేందుకు రెడీ అయ్యాడు. ఇద్దరి కాంబినేషనల్‌లో మూవీ తెరకెక్కనుందని ప్రకటించడంతో రెబల్‌స్టార్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా మూవీకి సంబంధించిన కీలక అప్‌డేట్‌ ఒకటి బయలకు వచ్చింది. ఈ చిత్రంలో ప్రభాస్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ప్రభాస్‌కు జోడీగా ‘మహానటి’ ఫేమ్‌ కీర్తి సురేష్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారని సమాచారం. మొదటలో యానిమల్‌ బ్యూటీ రష్మికను తీసుకుంటారనే ప్రచారం జరిగింది.

అలాగే, అనుష్క పేరు సైతం వినిపించింది. తాజాగా కీర్తి సురేష్‌ సురేష్‌ను ఫైనల్‌గా చేసినట్లు తెలుస్తున్నది. దీనిపై అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. ఇదే నిజమైతే కీర్తి ఖాతాలో మరో హిట్‌ పడినట్లేనని ఫ్యాన్స్‌ అంటున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ ఈ ఏడాది చివరిలో మొదలుపెట్టున్నట్లు టాక్‌. ప్రభాస్‌ ప్రస్తుతం సలార్‌-తో పాటు ‘మహానటి’ ఫేమ్‌ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌తో కల్కి 2979ఏడీ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ తర్వాత మారుతీ దర్శకత్వంలో ‘రాజాసాబ్‌’ చిత్రంలో మొదలుపెట్టనున్నాడు. ఆ తర్వాత ‘స్పిరిట్‌’ను షూటింగ్‌ను ప్రారంభించే అవకాశాలున్నాయి. అదే సమయంలో కీర్తి సురేష్‌ తమిళ చిత్రం ‘సైరన్‌’ నటించింది. ప్రస్తుతం ‘రఘుతాత’, రివాల్వర్‌ రీటా, కన్నివేది చిత్రాల్లో నటిస్తున్నది. అలాగే, ‘బేబీజాన్‌’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది. కీర్తి తెలుగులో చివరిసారిగా భోళాశంకర్‌ చిత్రంలో కనిపించింది.