Break UP| ఆ జంట బంధానికి కూడా బీట‌లు వారిన‌ట్టేనా.. బ్రేక‌ప్ త‌ర్వాత తొలిసారి కెమెరా ముందుకు..!

Break UP| ఇటీవ‌లి కాలంలో ప్రేమ, పెళ్లి, విడాకుల మాట‌లు.. సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి. పెళ్లైన ఏడాదికే విడిపోయిన కపుల్స్ కూడా ఉన్నారు. ఎప్పుడు ప్రేమ‌లో ప‌డుతున్నారో, ఎప్పుడు విడిపోతున్నారో చెప్ప‌డం చాలా క‌ష్టం అన్న‌ట్టుగా ఉంది ప‌రిస్థితి. అయితే ఇప్పుడు బాలీవుడ్ జంట ఒక‌టి బ్రేక‌ప్ చెప్పుకున్న‌ట్టు

  • By: sn    cinema    Jun 02, 2024 7:16 AM IST
Break UP| ఆ జంట బంధానికి కూడా బీట‌లు వారిన‌ట్టేనా.. బ్రేక‌ప్ త‌ర్వాత తొలిసారి కెమెరా ముందుకు..!

Break UP| ఇటీవ‌లి కాలంలో ప్రేమ, పెళ్లి, విడాకుల మాట‌లు.. సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి. పెళ్లైన ఏడాదికే విడిపోయిన కపుల్స్ కూడా ఉన్నారు. ఎప్పుడు ప్రేమ‌లో ప‌డుతున్నారో, ఎప్పుడు విడిపోతున్నారో చెప్ప‌డం చాలా క‌ష్టం అన్న‌ట్టుగా ఉంది ప‌రిస్థితి. అయితే ఇప్పుడు బాలీవుడ్ జంట ఒక‌టి బ్రేక‌ప్ చెప్పుకున్న‌ట్టు నెట్టింట ఓ వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్‌, యోగా బ్యూటీ మలైకా అరోరా , బాలీవుడ్ న‌టుడు అర్జున్ కపూర్ పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్న విష‌యం తెలిసిందే. కాని ఏం జ‌రిగిందో ఏమో తెలియ‌దు కాని ఆ జంట బ్రేక‌ప్ చెప్పుకున్న‌ట్టు టాక్ వినిపిస్తుంది. స‌ల్మాన్ ఖాన్ త‌మ్ముడు అర్బాజ్ ఖాన్‌తో 2017లో విడిపోయిన మలైకా 2018 నుంచి అర్జున్ కపూర్‌తో సహాజీవనం చేస్తుంది.

వీరిద్ద‌రు త‌మ రిలేష‌న్ గురించి ఓపెన్‌గా చెప్ప‌లేదు కాని, ఎక్క‌డ‌కి వెళ్లిన జంట‌గానే వెళుతూ సంద‌డి చేసేవారు.అర్జున్ కపూర్ తనకన్నా 12 ఏళ్లు పెద్దదైన మలైకా అరోరాతో ప్రేమాయణం సాగించ‌డం హాట్ టాపిక్ కూడా అయింది. అయితే కొంత కాలంగా వీరిద్ద‌రు దూరంగా ఉంటున్నార‌ని టాక్ న‌డుస్తుంది. రీసెంట్‌గా వారికి సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తి ఇద్ద‌రు విడిపోయినట్లు ధృవీకరించాడు. జాతీయ మీడియాలో కూడా ఆ ప్రముఖ వ్యక్తినే కోట్ చేస్తూ విడాకుల వార్తలను ప్రచురించారు. మలైకా అరోరా- అర్జున్ కపూర్ల మధ్య బంధం ఎంతో గొప్పది అంటూ ఆయన వ్యాఖ్యానించాడు. అయితే వారు విడిపోయిన తర్వాత కూడా వారి బంధాన్ని కొనసాగిస్తారంటూ ఆయ‌న చెప్పుకురావ‌డం విశేషం.

వారి బ్రేకప్ విషయాన్ని ప్రచారం చేయడం, చర్చించడం కూడా వారికి ఇష్టం లేదు అంటూ ఆ వ్యక్తి చెప్పుకొచ్చాడు. తమ బ్రేకప్ పై ఇప్పటి వరకూ మలైకాగానీ, అర్జున్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు. అయితే బ్రేక‌ప్ వార్త‌ల త‌ర్వాత మ‌లైకా ముంబైలోని బాంద్రా ఏరియాలో కనిపించింది. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ఫొటోగ్రాఫర్లను చూసి నవ్వుతూ వెళ్లిపోయింది. సాధార‌ణంగా అయితే ఆమె ఎప్పుడు కనిపించినా.. ఫొటోలకు పోజులివ్వడం, అభిమానులతో సెల్ఫీలు దిగడం వంటివి చేసేది, కాని ఈ సారి మాత్రం సింపుల్ గా ఓ నవ్వు నవ్వి అక్క‌డ నుండి మెల్ల‌గా జారుకుంది.