Horoscope | సోమవారం రాశిఫలాలు.. ఈ రాశివారికి ఆదాయానికి మించిన ఖర్చులు..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)
మేషరాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆటంకాలు అధిగమిస్తారు. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఒక సంఘటన ఎంతో ఆనందం కలిగిస్తుంది. స్వయంకృషితో ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు.
వృషభం (Taurus)
వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పట్టుదలతో ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వ్యాపారులు నూతన అవకాశాలు అందుకుంటారు. కీలక నిర్ణయాల విషయంలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు.
మిథునం (Gemini)
మిథునరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో కృషికి తగిన ఫలితాలు రాబట్టుతారు. ఆర్థికపరంగా ఈ రోజు విశేషమైన ప్రయోజనాలు ఉంటాయి. ఉత్సవాలు, వేడుకల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. అనవసర ఖర్చులు తగ్గించుకోండి.
కర్కాటకం (Cancer)
కర్కాటకరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. కుటుంబ సమస్యలు, బంధుమిత్రులతో విభేదాలు అశాంతి కలిగిస్తాయి. కోపాన్ని అదుపులో ఉంచుకుని ప్రశాంతంగా ఉండండి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి ఉండకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో మీ ప్రతిభను చాటుతారు. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆర్థికంగా శుభ యోగాలున్నాయి. సాహసోపేతమైన నిర్ణయాలతో విజయం సాధిస్తారు. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ధర్మసిద్ధి ఉంది. దైవబలంతో ప్రారంభించిన కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఉద్యోగులు పదోన్నతులు అందుకుంటారు. వ్యాపారులు మంచి లాభాలు గడిస్తారు. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి.
తుల (Libra)
తులారాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో మీ మాటకు గౌరవం, విలువ పెరుగుతాయి. వృత్తిలో మీ స్థాయి పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి, నూతన పెట్టుబడులకు అద్భుతమైన రోజు. సహోద్యోగులు, ఉన్నతాధికారుల నుంచి ప్రోత్సాహం, సహకారం లభిస్తుంది.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో చేపట్టిన పనుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ముందుచూపుతో నడుచుకోవడం మంచిది. ఉద్యోగ వ్యాపారాలలో సమయానుకూల నిర్ణయాలు మేలు చేస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో సహనంతో ఉండడం మంచిది.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో అప్రమత్తంగా ఉండాలి. పని ప్రదేశంలో ఘర్షణలు, వివాదాలకు పోవద్దు. ఆర్థికంగా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఆశావాదదృక్పదంతో ముందుకెళ్తే ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో శ్రద్ధ, ఏకాగ్రత పెంచండి. ఒక సంఘటన విచారం కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో శాంతంగా నడుచుకోండి. వివాదాలకు దూరంగా ఉండండి.
కుంభం (Aquarius)
కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. గ్రహసంచారం ప్రతికూలంగా ఉన్నందున చేపట్టిన ప్రతి పనిలోనూ జాగ్రత్త వహించాలి. ఉద్యోగ వ్యాపారాలలో ఆటంకాలు పెరుగుతాయి. అధికారులతో జాగ్రత్తగా నడుచుకోవాలి. కీలక వ్యవహారాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. ఖర్చులు పెరుగుతాయి.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఉత్సాహం, ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. కుటుంబ సభ్యులతో గొడవలు, వాదనలు చేయకుండా ఉంటే మంచిది. బుద్ధిబలం, సమయస్ఫూర్తి ఉంటే ఆటంకాలను అధిగమించవచ్చు. ప్రియమైన వారితో ప్రసన్నంగా వ్యవహరించండి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.