Nag Ashwin| ప్రభాస్ నటించిన కల్కి చిత్రం సూపర్ హిట్ కావడంతో నాగ్ అశ్విన్ పేరు మారు మ్రోగిపోతుంది. అంత పెద్ద స్టార్ క్యాస్టింగ్‌తో ఈ యువ దర్శకుడు చేసిన ప్రయోగం ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది. సినిమా సూపర్ హిట్ కావడంతో ప్రతి ఒక్కరు కూడా నాగ్ అశ్విన్‌పై ప్రశంసల జల్లు
Nag Ashwin| ప్రభాస్ నటించిన కల్కి చిత్రం సూపర్ హిట్ కావడంతో నాగ్ అశ్విన్ పేరు మారు మ్రోగిపోతుంది. అంత పెద్ద స్టార్ క్యాస్టింగ్‌తో ఈ యువ దర్శకుడు చేసిన ప్రయోగం ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది. సినిమా సూపర్ హిట్ కావడంతో ప్రతి ఒక్కరు కూడా నాగ్ అశ్విన్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. నాగ్ అశ్విన్.. ఎవడే సుబ్రహ్మణ్యం’ (Yevade Subramanyam) సినిమాతో దర్శకుడిగా పరిచయం కాగా, మహానటి సినిమాతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. అశ్వినీదత్ కి (C. Aswani Dutt) చిన్నల్లుడు అయిన నాగ్ అశ్విన్ కల్కి సినిమా కోసం దాదాపు నాలుగన్నర ఏళ్లు కష్టపడ్డాడు. ఆయన కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించింది.
అయితే కల్కి మూవీ రిలీజ్ తర్వాత నాగ్ అశ్విన్ తన ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది..తన చెప్పులు అరిగిపోయేలా ఈ సినిమా కోసం పనిచేశానని చెప్పేలా తన అరిగిపోయిన చెప్పులని ఫొటో తీసి షేర్ చేశాడు. ఈ పిక్ చూస్తుంటే దర్శకుడు అతని బృందం సినిమా కోసం ఎంత కష్టపడ్డారనేది అర్ధమవుతుంది. గతంలోనూ అతడు ఈ చెప్పులను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ… తన చెప్పుకు ముల్లులా ఉన్న కుట్టును చూపిస్తూ.. ఇది తనకో రిమైండర్ అని అనడం విశేషం.కల్కి 2898 ఏడీ మూవీ రిలీజ్ కు ముందు నాగ్ అశ్విన్ ఎన్నో పోస్టులు చేసినా.. రిలీజ్ తర్వాత చెప్పులతో చేసిన పోస్ట్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇక కల్కి విషయానికి వస్తే ఈ మూవీ హాలీవుడ్ చిత్రాన్ని మించి ఉందని పలువురు కామెంట్ చేస్తున్నారు. చిత్రం ప్రతి ఒక్కరిది చాలా పవర్ ఫుల్ రోల్ అని, ప్రతి ఒక్కరు తమ తమ పాత్రలలో అద్భుతంగా నటించారంటూ కొనియాడుతున్నారు. కమల్‌హాసన్ సినిమాలో కేవలం పది నిమిషాల లోపే కనిపిస్తారు. సెకండ్ పార్ట్‌లోనే ఆయన క్యారెక్టర్‌కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుందని డైరెక్టర్ హింట్ ఇచ్చాడు. ప్రభాస్ క్యారెక్టర్‌కు ధీటుగా అశ్వత్థామ పాత్రను రాసుకోగా, అందులో అమితాబ్‌బచ్చన్ అద్భుతంగా నటించారు. తన డైలాగ్ డెలివరీ, అతడి స్క్రీన్‌ప్రజెన్స్ వావ్ అనిపిస్తాయి.