Niharika|బెడ్ రూమ్ సంగతి చెప్పి నిహారిక పరువు తీసిన నాగబాబు.. పక్కనే ఉన్న భార్య ఏం చేసిందంటే..!
Niharika| మెగా డాటర్ నిహారిక కొణిదెల ఇటీవల తెగ వార్తలలో నిలుస్తుండడం మనం చూస్తున్నాం. ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు జేవీ చైతన్యను పెళ్లి చేసుకున్న ఈ భామ కొన్నాళ్లపాటు అన్యోన్యంగానే ఉన్నా ఊహించని విధంగా విడాకులు తీసుకున్నారు. వీరు ఎందుకు విడిపోయారు అనేది ఇప్ప

Niharika| మెగా డాటర్ నిహారిక కొణిదెల ఇటీవల తెగ వార్తలలో నిలుస్తుండడం మనం చూస్తున్నాం. ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు జేవీ చైతన్యను పెళ్లి చేసుకున్న ఈ భామ కొన్నాళ్లపాటు అన్యోన్యంగానే ఉన్నా ఊహించని విధంగా విడాకులు తీసుకున్నారు. వీరు ఎందుకు విడిపోయారు అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. అయితే విడాకుల తర్వాత నిహారిక నిర్మాతగా రాణించే ప్రయత్నం చేస్తుంది. ఈ ఏడాది మెగా కుటుంబానికి వరుసపెట్టి అన్నీ శుభాలే జరుగుతున్నాయి. రాంచరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ప్రపంచ ప్రఖ్యాత ‘ఆస్కార్’ అవార్డ్ రావడం, వరుణ్ తేజ్ తన సహనటి లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవడం, మెగాస్టార్ చిరంజీవిని భారత రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ వరించడం, ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పవన్ పార్టీ ప్రభంజనం సృష్టించడం మనం చూశాం.
అన్ని రకాలుగా మెగా ఫ్యామిలీకి మంచి సమయం నడుస్తుండగా.. అలాంటి మంచే తనకూ జరగాలని నిహారిక కోరుకుంటుంది . హీరోయిన్‌గా సక్సెస్ కాలేకపోవడంతో ఆమె నిర్మాతగా మారి పలు వెబ్‌సిరీస్‌లు, డాక్యుమెంటరీలు నిర్మిస్తుంది. ఈ క్రమంలో నిహారిక కమిటీ కుర్రోళ్లు అనే సినిమాను నిర్మించారు. యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 9న రిలీజ్ కానుండగా, రీసెంట్‌గా మూవీ ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ వేడుకలో నిహారిక మాట్లడుతూ తాను నిర్మాతగా తొలిసారిగా సినిమాతో వస్తున్నానని ఈ సినిమా హిట్ చేసేయండ్రా ప్లీజ్ అంటూ నిహారిక ప్రేక్షకులను కోరారు.ఇక ఇదే ఈవెంట్‌లో నిహారిక ఫాదర్ నాగబాబు కూడా పాల్గొన్నాడు. ఆయన మాట్లాడుతూ నిహారిక పరువు తీశాడు.
ఇక్కడ ఎవడి సెల్ఫ్ డబ్బా వాడే కొట్టుకోవాలని,అందరు అదే చేస్తున్నారని, తాను నిహారిక గురించి ఓ విషయం చెప్పాలనుకుంటున్నానని అన్నాడు. నిహారిక మూడు, నాలుగేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఏం చేసిందో చెప్పాడు నాగబాబు. కాస్త పెద్దగా అయ్యింది కాబట్టి, ఇండిపెండెంట్‌గా పడుకోమని నిహారిక చెప్పారట నాగబాబు, ఆయన భార్య పద్మ. మొదట బాగానే వెళ్లేదట. కానీ మదర్ అటు కిచెన్‌లోకి వెళ్లగానే వచ్చిన బెడ్‌లో దూరేదని, లేదంటే అమ్మకి కనిపించకుండా తన షర్ట్ లోకి దూరేదని, అల్లరి బాగా చేసేదని చెప్పాడు నాగబాబు. అయితే బెడ్ మ్యాటర్ చెప్పడంతో నిహారికా, అలాగే పక్కన ఉన్న వాళ్ల అమ్మ పద్మ కూడా ముఖం చాటేశారు. ఫేస్‌కి చేయి అడ్డుపెట్టుకుని సిగ్గు పడ్డారు.