Naga Chaitanya| బ్లాక్ అండ్ బ్లాక్‌లో నాగ చైతన్య, శోభిత..ఎంగేజ్‌మెంట్ తర్వాత బయటికొచ్చిన తొలి ఫొటో
Naga Chaitanya| అక్కినేని అందగాడు హీరో నాగ చైతన్య కొన్నేళ్ల క్రితం సమంతని వివాహం చేసుకొని కొన్నేళ్ల కాపురం తర్వాత ఆమెకి విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుండి కొన్నాళ్లపాటు సింగిల్‌గా ఉన్న చైతూ.. హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో ప్రేమలో పడ్డాడు.వీరిద్దరు సీక్రెట్‌గా ప్రే

Naga Chaitanya| అక్కినేని అందగాడు హీరో నాగ చైతన్య కొన్నేళ్ల క్రితం సమంత(Samantha)ని వివాహం చేసుకొని కొన్నేళ్ల కాపురం తర్వాత ఆమెకి విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుండి కొన్నాళ్లపాటు సింగిల్‌గా ఉన్న చైతూ.. హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో(Sobhita) ప్రేమలో పడ్డాడు.వీరిద్దరు సీక్రెట్‌గా ప్రేమించుకొని ఆగస్టు 8న ఎంగేజ్‌మెంట్ జరుపుకున్నారు. హైదరాబాద్ లోని అక్కినేని నాగార్జున నివాసంలో జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ లవ్ బర్డ్స్ ఎంగేట్‌మెంట్ చేసుకున్న విషయాన్ని స్వయంగా నాగార్జునే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆ తర్వాత నాగ చైతన్య, శోభితలు తమ ఎంగేజ్‌మెంట్ ఫొటోలు షేర్ చేశారు.
ఎంగేజ్ మెంట్ తర్వాత నాగ చైతన్య, శోభితలు ప్రొఫెషనల్ లైఫ్‌లో బిజీ కాగా,వీరి వివాహం ఎప్పుడు జరుగుతుందనే చర్చ టాలీవుడ్‌లో నడుస్తుంది. నాగ చైతన్య మరియు శోభిత డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం సరైన వేదికను వెతుకుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో లేదా రాజస్థాన్‌లో వీరి వివాహం జరగవచ్చని ఓ టాక్ అయితే నడుస్తుంది. ఈ సంవత్సరం చివరిలో లేదా వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో నాగ చైతన్య, శోభితల వివాహం జరగనుందని సన్నిహితులు చెబుతున్నారు. ఈలోపు నాగ చైతన్య, శోభితల సినిమాలు కూడా కంప్లీట్ అవుతాయని, పెళ్లికి తగినంత సమయం దొరకనుందని అంటున్నారు. అయితే ఎంగేజ్‌మెంట్ తర్వాత నాగ చైతన్య తొలిసారి తనకు కాబోయే భార్య, నటి శోభితా ధూళిపాళ్లతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇద్దరూ కలిసి ఓ లిఫ్ట్‌లో దిగిన ఫొటోని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఈ పిక్ శోభిత తీసినట్లు స్పష్టమవుతోంది. నాగ చైతన్య లిఫ్ట్‌లోని మిర్రర్ వైపు చూస్తూ ఫొటోకి పోజు ఇస్తున్నారు. శోభిత మిర్రర్లో కనిపించే ఇద్దరి ప్రతిబింబాలను క్యాప్చర్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇద్దరూ స్టైలిష్ కళ్లద్దాలు ధరించి బ్లాక్ ఔట్ఫిట్లో ఉన్నారు. చూస్తుంటే ఎక్కడికో షాపింగ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక ‘Everything everywhere all at once’ అని క్యాప్షన్ రాసుకురాగా, ఈ పిక్‌కి నెటిజన్స్ నుండి క్రేజీ రియాక్షన్ వచ్చింది. ఏది ఏమైన ఈ జంట అయిన నిండు నూరేళ్లు కలిసి ఉంటే చూడాలని ఉందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.