Naga Chaitanya|శోభిత‌తో విదేశాల‌కి చెక్కేసిన నాగ చైత‌న్య‌.. అనుమానాల‌కి దారి తీసిన సోష‌ల్ మీడియా పోస్ట్

Naga Chaitanya| అక్కినేని మూడో త‌రం వార‌సుడు నాగ చైత‌న్య సినిమాల‌తో పెద్ద‌గా అల‌రించ‌డం లేదు. మ‌రోవైపు ఆయ‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ కూడా డిస్ట్ర‌బ్‌లో ఉంది. స‌మంత‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైత‌న్య నాలుగేళ్ల‌కి ఆమె నుండి విడిపోయాడు. 2018లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట 2021లో

  • By: sn    cinema    Apr 22, 2024 7:55 PM IST
Naga Chaitanya|శోభిత‌తో విదేశాల‌కి చెక్కేసిన నాగ చైత‌న్య‌.. అనుమానాల‌కి దారి తీసిన సోష‌ల్ మీడియా పోస్ట్

Naga Chaitanya| అక్కినేని మూడో త‌రం వార‌సుడు నాగ చైత‌న్య సినిమాల‌తో పెద్ద‌గా అల‌రించ‌డం లేదు. మ‌రోవైపు ఆయ‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ కూడా డిస్ట్ర‌బ్‌లో ఉంది. స‌మంత‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైత‌న్య నాలుగేళ్ల‌కి ఆమె నుండి విడిపోయాడు. 2018లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట 2021లో అధికారికంగా విడాకుల ప్రకటన చేసి ప్ర‌తి ఒక్క‌రు ఉలిక్కి ప‌డేలా చేశారు. అస‌లు వారు విడిపోవ‌డానికి కార‌ణం ఏంటో తెలియ‌దు కాని, నిత్యం వారి విడాకుల విష‌యంపై అనేక వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉంటాయి. అయితే ప్ర‌స్తుతం నాగ చైతన్య సింగిల్ గానే ఉంటున్నాడు. అయితే సైలెంట్‌గా శోభిత ధూళిపాళ్ల‌తో సీక్రెట్ ప్రేమాయ‌ణం న‌డిపిస్తున్నాడ‌ని టాక్ వినిపిస్తుంది.

శోభిత ధూళిపాళ్లను నాగ చైత‌న్య త‌ర‌చుగా క‌ల‌వ‌డ‌మే కాకుండా త‌న కొత్త ఇంటికి కూడా తీసుకెళ్లాడ‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం న‌డిచింది. ఇక ఆ మ‌ధ్య లండన్ వెళ్లిన స‌మ‌యంలో నాగ చైతన్యతో శోభిత ధూళిపాళ్ల కనిపించింది. ఇండియన్ రెస్టారెంట్ కి వెళ్లిన స‌మ‌యంలో చెఫ్ నాగ చైతన్యతో సెల్ఫీ దిగి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయ‌గా, బ్యాక్‌గ్రౌండ్‌లో శోభిత కూడా కనిపించింది. ఇంకేముందు ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమాయ‌ణం సాగుతుందంటూ రూమ‌ర్స్ స్ప్రెడ్ చేశారు. దీంతో వెంటనే సదరు ఫోటోని ఆ చెఫ్ డిలీట్ చేశాడు. అయిన‌ప్ప‌టికీ అప్ప‌టికే జ‌ర‌గ‌రాని న‌ష్టం జ‌రిగింది.

ఇక తాజాగా నాగ చైతన్య త‌న సోష‌ల్ మీడియాలో ఓ ఫొటో షేర్ చేశాడు. ఇందులో సాయంత్రపు సూర్యకిరణాలు ఆస్వాదిస్తున్నట్టుగా ఫొటో షేర్ చేశాడు. దీనికి శోభిత ధూళిపాళ్ల లైక్ కొట్ట‌డం విశేషం. అయితే ఈ పిక్ చూసిన కొంద‌రు శోభిత కూడా అక్క‌డే ఉండి ఉంటుంది. ఇద్ద‌రు క‌లిసి ఏకాంతం కోసం ఎక్క‌డికో చెక్కేసి ఉంటార‌ని అంటున్నారు. మ‌రి కొందరు అయితే త్వ‌ర‌లో పెళ్లి కూడా చేసుకుంటార‌ని అంటున్నారు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ టైటిల్ తో ఒక చిత్రం చేస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా ఈ మూవీకి చందూ మొండేటి దర్శకత్వం వ‌హిస్తున్నాడు. ఇక శోభిత శోభిత నటించిన హాలీవుడ్ మూవీ మంకీ మ్యాన్ అమెరికాలో విడుదల కాగా, త్వ‌ర‌లోనే ఈ మూవీని ఇండియాలో రిలీజ్ చేయ‌నున్నారు. ఇందులో వేశ్యాగా క‌నిపించ‌నుంది శోభిత.