Revanth Reddy To Visit Delhi : రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. డీసీసీ అధ్యక్షుల నియామక సమావేశంలో పాల్గొననున్నారు. రాష్ట్ర విషయాలపై హైకమాండ్‌తో చర్చించనున్నారు.
న్యూఢిల్లీ: సీఎం రేవంత్ రెడ్డి శనివారం మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మల్లిఖార్జున్ ఖర్గే అధ్వర్యంలో జరిగే డిసీసీ అధ్యక్షుల నియామకం సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. సీఎంతో పాటు పీసీసీ చీఫ్ బీ.మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో డీసీసీ అధ్యక్షుల ఎంపికను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ మేరకు తెలంగాణకు 22 మంది పరిశీలకులను నియమించింది. ఒత్తిళ్లకు తావులేకుండా నిర్ణయాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఏఐసీసీ సీనియర్ నాయకులను ఇన్‌చార్జిలుగా నియమించింది.
ఈ నెల చివరి వరకు డీసీసీ అధ్యక్షులను ఏఐసీసీ ప్రకటించనుంది. డీసీసీ అధ్యక్ష పదవి కోసం ఆశావహులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో డీసీసీకి ముగ్గురు పేర్లను పరిశీలనలోకి తీసుకున్నారు. రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ లు ఢిల్లీ పర్యటనలో రాష్ట్రంలో మంత్రులు, నేతల మధ్య వివాదాలు, బీసీ రిజర్వేషన్లపై హైకమాండ్ పెద్దలతో చర్చించనున్నట్లుగా సమాచారం. అలాగే రేవంత్ రెడ్డి రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్నందునా.. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram