Revanth Reddy| నేడు మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి నేడు శనివారం మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరుతారు.
విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేడు శనివారం మరోసారి ఢిల్లీ(Delhi Visit)పర్యటనకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరుతారు. సీఎం రేవంత్ తో పాటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కూడా వెళ్లే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. వారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో భేటీ కానున్నారు. రేవంత్ రెడ్డి తిరిగి రేపు హైదరాబాద్‌కు చేరుకుంటారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించిన తీరుతెన్నులను రేవంత్ రెడ్డి హైకమాండ్ కు వివరించనున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై అనుసరించాల్సిన విధానంపై పార్టీ అధినాయకత్వంతో చర్చిస్తారు. ముఖ్యంగా ఈ నెల 17న తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించనుండగా..అందులో స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నదానిపై రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ లు హైకమాండ్ తో చర్చించనున్నట్లుగా సమాచారం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram