Marriages | ముగిసిన మూఢం.. నేటి నుంచి మే 9 వరకు మోగనున్న పెళ్లి భాజాలు..!
Marriages | గత మూడు నెలలుగా శుభ ముహుర్తాలు( Shubha Muhurtham ) లేవు.. దీంతో చాలా మంది తమ వివాహాలను( Marriages ) వాయిదా వేసుకుంటూ వచ్చారు. అయితే ఫిబ్రవరి 17తో మూఢం ముగిసింది. అంటే ఫిబ్రవరి 18 నుంచి శుభముహుర్తాలు ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి మే 9వ తేదీ వరకు పెళ్లి భాజాలు మోగనున్నాయి.
Marriages | వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాల్లో శుక్రుడు వివాహం, దాంపత్య సౌఖ్యం, ఐశ్వర్యం, సుఖసంతోషాలకు కారకుడిగా భావించబడుతాడు. గ్రహ గమనంలో శుక్రుడు సూర్యునికి అత్యంత సమీపంగా వచ్చినప్పుడు సూర్యుని కాంతి ప్రభావంతో శుక్రుడు అస్తమయ స్థితిలోకి వెళ్తాడు. ఈ స్థితినే శుక్ర మౌఢ్యం లేదా శుక్ర మూఢమి అంటారు. ఈ కాలంలో వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి శుభకార్యాలు చేయడం శాస్త్రోక్తంగా అనుకూలం కాదని జ్యోతిష్యులు సూచిస్తారు. అయితే ఈ కాలం ఫిబ్రవరి 17వ తేదీతో ముగిసింది. దీంతో బుధవారం నుంచి వివాహాలు, గృహ ప్రవేశాలు, ఉపనయనాలు వంటి కార్యక్రమాలు జరుపుకోవచ్చు.
శుభ ముహుర్తాలు ఎప్పట్నుంచంటే..?
ఫిబ్రవరి 17, మంగళవారం నాటితో శుక్ర మూఢమి పూర్తవుతోంది. ఆ తర్వాత శుక్రుడు అస్తమయ స్థితి నుంచి బయటపడి మళ్లీ శుభప్రద స్థితికి వస్తాడు. దీంతో వివాహాది శుభకార్యాలకు అనుకూలమైన ముహూర్తాలు లభించనున్నాయి. ఫిబ్రవరి 18, బుధవారం నుంచి వివాహాలకు శుభ ముహూర్తాలు ప్రారంభమవుతాయి. ఇక్కడి నుంచి వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించుకోవచ్చని పండితులు చెబుతున్నారు.
పెళ్లిళ్లకు అనుకూలం సమయం ఎప్పటి వరకు..?
ఫిబ్రవరి 18 నుంచి మే 9 వరకు వివాహ ముహూర్తాలు అందుబాటులో ఉంటాయి. అనంతరం మే 17 నుంచి అధిక మాసం ప్రారంభమవడంతో మళ్లీ శుభకార్యాలకు విరామం ఏర్పడే అవకాశముంది. ఈ ఏడాది వివాహం చేసుకోవాలనుకునే వారు ఈ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం మంచిది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram