Akhanda 2 Thaandavam | ‘అఖండ 2: తాండవం’ నుంచి కీలక అప్డేట్

బాలకృష్ణ నటిస్తున్న ‘అఖండ 2: తాండవం’ నుంచి మేకర్స్ కీలక అప్డేట్ విడుదల చేశారు. డిసెంబరు 5న గ్రాండ్ రిలీజ్ కానున్నది.

Akhanda 2 Thaandavam | ‘అఖండ 2: తాండవం’ నుంచి కీలక అప్డేట్

విధాత : బోయపాటి శ్రీను దర్శకత్వంలో సీనీయర్ హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘అఖండ 2: తాండవం’ నుంచి మేకర్స్ కీలక అప్డేట్ విడుదల చేశారు. ‘అఖండ 2: తాండవం’ ‘బ్లాస్టింగ్‌ రోర్‌’ జస్ట్ బిగినింగ్ అంటూ శుక్రవారం చిత్ర బృందం స్పెషల్ వీడియోను విడుదల చేసింది. ఒకేసారి తెలుగు, కన్నడ, మలయళ, తమిళ, హిందీ భాషల్లో ఈ వీడియో విడుదల చేయడం విశేషం. విలన్లతో ఫైట్ చేస్తున్న బాలయ్య ‘సౌండ్‌ కంట్రోల్‌లో పెట్టుకో.. ఏ సౌండ్‌కు నవ్వుతానో.. ఏ సౌండ్‌కు నరుకుతానో నాకే తెలియదు కొడుకా’ అంటూ చేసిన డైలాగ్స్ గర్జన అదిరిపోయింది.

తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాలయ్య డైలాగ్ లకు, పోరాట సన్నివేశాలకు మరింత హైప్ కల్పించింది. ఆఖండలో అఘోరా, మురళీకృష్ణ పాత్రాలలో బాలయ్య డ్యూయోల్ రోల్ పోషించారు. అఖండకు సీక్వెల్ గా వస్తున్న ‘అఖండ 2: తాండవం’ మూవీలోనూ ఆ రెండు పాత్రలు కొనసాగనున్నాయి. ఇప్పటిదాకా అఘోరా పాత్రను పరిచయం చేసిన చిత్ర బృందం ఈసారి మురళీకృష్ణ పాత్రను పరిచయం చేయడం గమనార్హం. ఆఖండ 2 తాండవం డిసెంబరు 5న విడుదలవుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాచి. సంయుక్తా మేనన్, ప్రగ్యా జైస్వాల్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ఎం.తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు.