Nagarjuna| సెల్ఫీ కోసం వచ్చిన అభిమాని.. నెట్టి పడేసిన నాగ్ బాడీగార్డ్.. కింగ్ క్షమాపణలు
Nagarjuna| కింగ్ నాగార్జున.. టాలీవుడ్ లో ఈ పేరు చెబితే ఇప్పటికీ కొందరిలో వైబ్రేషన్స్ మొదలు అవుతాయి. ఒకప్పుడు నాగార్జున అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉండేవాడు. ఆయనని ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టపడేవారు. 60 ఏళ్ళు దాటినా.. ఇప్పటికీ నవమన్మధుడిలా.. టాలీవుడ్ రొమాంటిక్ హీరోగా తన స్థానాన్నిఅలా పదిలపరచుకున్నాడు. ఎవరు కూడా నాగార్జున స్థానాన్ని ఎవరూ బర్తీ చేయలేకపోతున్నారు. ఇద్దరు కొడుకులకి పోటీగా సినిమాలు

Nagarjuna| కింగ్ నాగార్జున.. టాలీవుడ్ లో ఈ పేరు చెబితే ఇప్పటికీ కొందరిలో వైబ్రేషన్స్ మొదలు అవుతాయి. ఒకప్పుడు నాగార్జున అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉండేవాడు. ఆయనని ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టపడేవారు. 60 ఏళ్ళు దాటినా.. ఇప్పటికీ నవమన్మధుడిలా.. టాలీవుడ్ రొమాంటిక్ హీరోగా తన స్థానాన్నిఅలా పదిలపరచుకున్నాడు. ఎవరు కూడా నాగార్జున స్థానాన్ని ఎవరూ బర్తీ చేయలేకపోతున్నారు. ఇద్దరు కొడుకులకి పోటీగా సినిమాలు కూడా చేస్తూ అలరిస్తున్నారు నాగార్జున. ఇక మన కింగ్ మాట్లాడినంత నైస్ గా ఇంకా ఏహీరో మాట్లాడలేరేమో. అందుకే ఆయన అభిమానులతో పాటు హీరోయిన్లను కూడా ఇలానే బుట్టలో వేసుకున్నాడు కింగ్ నాగార్జున.
ఇటీవల నాగార్జునకి సరైన హిట్స్ పడడం లేదు. అయినప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు.వైవిధ్యమైన పాత్రలు ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అయితే నాగార్జునకి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వస్తున్న నాగార్జునను చూసిన ఓ అభిమాని ఆయనతో కలిసి సెల్ఫీ దిగేందుకు దూసుకువచ్చాడు. అయితే పక్కనే ఉన్న బాడీగార్డ్ సదరు వ్యక్తిని పక్కకి లాగి పడేశాడు. కాస్త అయితే కిందపడేవాడు. అయితే వీడియో మన సౌత్ పెద్దగా వైరల్ కాలేదు కాని నార్త్ సైడ్ మాత్రం బాగా వైరల్ అయ్యింది. దాంతో చాలా మంది నాగ్ ని తిట్టడం మొదలు పెట్టారు. ఇక ఈ వీడియో నాగార్జున దృష్టికి రావడంతో ఆయన కూడా స్పందించారు.
నాగార్జున బాడీ గార్డ్ పక్కకు నెట్టిన వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఈ ఘటన నా దృష్టికి వచ్చింది. ఇలాంటిది జరగకుండా ఉండాల్సింది. సదరు వ్యక్తికి నేను క్షమాపణలు చెబుతున్నా. ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటాను అంటూ నాగార్జున తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. నాగ్ మంచి మనస్సుని నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. సాధారణంగా నాగార్జున ఎక్కువగా ట్రోలింగ్ బారిన పడడు. ఎప్పుడన్నా ఇలాంటి సంఘటనలతోనే ఆయనని ట్రోల్ చేస్తూ ఉంటారు.
This just came to my notice … this shouldn’t have happened!!
I apologise to the gentleman 🙏and will take necessary precautions that it will not happen in the future !! https://t.co/d8bsIgxfI8— Nagarjuna Akkineni (@iamnagarjuna) June 23, 2024