Namitha| బొద్దుగుమ్మ నమిత గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడికి గుళ్లు కట్టే అభిమానులు కూడా ఉన్నారు. ‘సొంతం’ సినిమాతో నమిత తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ భామ ఆ తరువాత కూడా కొన్ని సినిమాల్లో మంచి
Namitha| బొద్దుగుమ్మ నమిత గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడికి గుళ్లు కట్టే అభిమానులు కూడా ఉన్నారు. ‘సొంతం’ సినిమాతో నమిత తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ భామ ఆ తరువాత కూడా కొన్ని సినిమాల్లో మంచి అవకాశాలు అందుకుంది. బాలయ్యతో సింహ సినిమాలో నటించి.. అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత సరైన అవకాశాలు రాక కోలీవుడ్లోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే 2017లో వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని నమిత 2022లో కవల పిల్లలకి జన్మనిచ్చింది. ప్రస్తుతం భర్త, పిల్లలతో నమిత వైవాహిక జీవితం సంతోషంగానే ఉంది.
అయితే నమిత కన్నా ఆమె భర్త చిన్నవాడు. ఇద్దరు ఇష్టపడి వివాహం చేసుకున్నారు. అయితే ఇటీవల వీరిద్దరు విడిపోయారంటూ అనేక ప్రచారాలు జరిగాయి. దానిని నమిత కొట్టిపడేసింది. సినీ రంగంలో చాలా వదంతులు ఎదుర్కొన్నానని చెప్పిన నమిత, ఈ రూమార్స్తో మా జంట ఏం బాధపడట్లేదని, అంతేకాక ఎంటర్ టైన్మెంట్ గా ఫీలై ఫుల్లుగా నవ్వుకున్నామని ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. అలానే ప్రెగ్నన్సీ విషయంలో ఎదుర్కొన్న ఇబ్బందులని గురించి తెలియజేస్తూ అందరు షాకయ్యేలా చేసింది ఈ బొద్దుగుమ్మ. 2021లో నమిత తొలిసారి గర్భవతి అయిందట. ఇంట్లో అందరికి చెప్పాను. మా నాన్నకి నువ్వు తాతయ్య కాబోతున్నావు అని చెప్పాను. వాళ్లు చాలా సంతోషించారు.. కానీ ఆ సంతోషం ఎక్కువరోజులు నిలవలేదు.
నాలుగు నెలలకే అబార్షన్ కావడంతో చాలా డిప్రెషన్ లోకి వెళ్ళాను. కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఆ తర్వాత మళ్ళీ గర్భవతి అయ్యాను. మూడు నెలలకే నాకు ట్విన్స్ పుట్టబోతున్నారని తెలిసింది. ఆ సమయంలో నన్ను బెడ్ పై నుంచి కూడా నా భర్త దిగనివ్వలేదు. ఎక్కువగా నడవకూడదు.. మెట్లు ఎక్కకూడదు అని కండిషన్స్ పెట్టారు. అయితే ప్రగ్నెంట్ అయినప్పటికీ నాకు 7 నెలల వరకు గర్భం బయటకి కనిపించలేదు. పొట్ట పెరగలేదు. దీనితో చాలా టెన్షన్ పడ్డాను. 7 నెలల తర్వాత గర్భం కనిపిస్తూ వచ్చింది. బహుశా తాను బొద్దుగా అనడం వల్ల అలా అనిపించి ఉండొచ్చని నమిత చెప్పుకొచ్చింది. అయితే తనకి ట్విన్స్ పుట్టడంతో చాలా సంతోషించింది నమిత. ఇప్పుడు ఈ అమ్మడు బిజెపి నాయకురాలిగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. సినిమాలకి కాస్త దూరంగానే ఉంటున్నారు.